సాధారణంగా ఎవరికైనా సరే టాలెంటెడ్ వుంటే సినీ పరిశ్రమ వారిని నెత్తిన పెట్టుకుంటుంది అనడానికి మన స్టార్ హీరోలు నిదర్శనమని చెప్పవచ్చు.. ఇక అంతే కాదు స్టార్ హీరోలు ప్రతిభ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో కూడా ఏ మాత్రం వెనుకాడడం లేదు.. ఈ మధ్యకాలంలో యువ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ పోలంకి.. ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, సూపర్ స్టార్ హీరోయిన్ సమంత చేత ప్రశంసలు అందుకున్నారు.. పాన్ ఇండియా సెన్సేషన్ మూవీ అయిన పుష్ప ఫంక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొరియోగ్రాఫర్ విజయ్ గురించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కు డాన్స్ మాస్టర్ కూడా ఈయనే.. ఇతని డాన్స్, వర్క్ అన్నీ కూడా సమంత కు బాగా నచ్చడంతో ఆమె బెస్ట్ విషెస్ చెబుతూ విజయ్ ను కూడా పొగడ్తలతో ముంచెత్తింది.

ఇక వీటితోనే కాకుండా కొబ్బరిమట్ట, పలాస 1978, విజేత, శశి ,అల్లుడు అదుర్స్  ఇలాంటి ఎన్నో చిత్రాలకు మంచి కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఈయన తాజాగా గల్లా అశోక్ నటించిన హీరో చిత్రానికి కూడా కొరియోగ్రాఫర్ గా పని చేయడమే కాకుండా నృత్యాలను కూడా అందించాడు.. తాజాగా గల్లా అశోక్ హీరోగా నటించిన హీరో సినిమాలో డోనల్  డగ్గు ర్యాంప్ పాటకు కు  విజయ్ కంపోజ్ చేసి స్టెప్పులకు బాగా మంచి రెస్పాన్ లభిస్తోంది. ఇక త్వరలోనే నరకాసుర తో పాటు మరో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా విజయ్ పని చేయబోతున్నారు.. ఇండస్ట్రీలో ఈ కొరియోగ్రాఫర్ స్పీడు చూస్తుంటే త్వరలో స్టార్ కొరియోగ్రాఫర్ గా అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి.

ఇకపోతే విజయ్ పోలంకి ఒక స్టార్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకోవాలనే కోరిక ఆయనకు ఉందట . ఈ నేపథ్యంలోనే తనలో ఉన్న ప్రతిభను బయటపెడుతూ స్టార్ హీరోలందరి ప్రశంశలు పొందడంతో పాటు వారి సినిమాల ద్వారానే అవకాశాలను కొట్టేస్తున్నారు.ఈయన దూకుడు చూస్తుంటే అదృష్టం వరించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: