నందమూరి నటసింహం బాలకృష్ణ కొంతకాలం వరుస ఫ్లాప్ లతో డీలా అయిపోయాడు. అలాంటి సమయం లోనే టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతుంది అంటూ అనౌన్స్మెంట్ జరిగింది . ఈ సినిమా అనౌన్స్ మెంట్ జరగగానే ఈ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. దానికి ప్రధాన కారణం అప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సింహ, లెజెండ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవడమే. అలాంటి క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్ కావటంతో ఈ సినిమాపై మొదటి నుండి అనేక అంచనాలు పెరిగి ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. అలా ఎన్నో అంచనాల నడుమ 2 డిసెంబర్ 2021 థియేటర్ లలో విడుదలైన ఈ సినిమాకు మొదటి షో నుండే బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది.

 ఆ టాక్ తగినట్టుగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కూడా ఈ సినిమా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇలా ఈ సినిమా మంచి విజయం సాధించడంతో బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలను ఓకే చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. దీనితో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వం లో కూడా ఒక సినిమాలో నటించడానికి బాలకృష్ణ రెడీగా ఉన్నాడు. వీటితో పాటు సంపత్ నంది దర్శకత్వంలో కూడా బాలకృష్ణ సినిమా చేయబోతున్నాడు అనే ఒక టాక్ నడుస్తోంది. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా బాలకృష్ణ ఒక సినిమా చేయబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఇలా అఖండ సినిమా కంటే ముందు స్లో అయిన బాలకృష్ణ ప్రస్తుతం మాత్రం ఫుల్ స్పీడ్ దూసుకుపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: