సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అందరూ కూడా విషాదంలో మునిగిపోయారు. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా వైరస్ బారినపడ్డారు. అయితే ఇక ఈ వార్త తోనే అభిమానులు అందరూ ఎంతగానో ఆందోళన చెందారు. సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరగా కరోనా వైరస్ బారి నుంచి కోలుకోవాలని అభిమానుల కోరుకున్నారు. కానీ అంతలోనే అభిమానులందరినీ తీవ్ర విషాదం లోకి నెట్టే మరో ఘటన చోటు చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ  పెద్దబ్బాయి మహేష్ బాబు అన్నయ్య ఘట్టమనేని రమేష్ బాబు హఠాత్ మరణం తో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. కొన్నేళ్ల నుంచి కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు ఘట్టమనేని  రమేష్ బాబు.


 ఈ క్రమంలోనే వైద్యుల పర్యవేక్షణలో ఇంట్లోనే చికిత్స తీసుకుంటూ ఉన్నారు. అయితే ఇటీవలే శనివారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు వెంటనే గచ్చిబౌలిలోని ఏ ఐ టి ఆసుపత్రి కి రమేష్ బాబును తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి తీవ్రంగా విషమించడంతో ఇక ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలోనే మార్గమధ్యంలో రమేష్ బాబు తుదిశ్వాసవిడిచారు. ఇక రమేష్ బాబు మరణవార్త అభిమానులందరినీ కూడా దిగ్భ్రాంతిలో ముంచెత్తింది. ఇకపోతే  తెలుగు చిత్ర పరిశ్రమలో రమేష్ బాబు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో మెప్పించారు.


 1977 సంవత్సరంలో మనుషులు చేసిన దొంగలు అనే చిత్రం తో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన రమేష్ బాబు ఇక ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో ఆకట్టుకున్నారు.  మొత్తంగా 17 సినిమాల్లో నటించారు  అయన. ‘నీడ’ ‘పాలు నీళ్ళు’ ‘సామ్రాట్’ ‘చిన్ని కృష్ణుడు’ ‘బజారు రౌడీ’ ‘ముగ్గురు కొడుకులు’ ‘బ్లాక్ టైగర్’ ‘కృష్ణ గారి అబ్బాయి’ ‘ఆయుధం’ ‘కలియుగ అభిమన్యుడు’ ‘నా ఇల్లే నా స్వర్గం’ ‘మామా కోడలు’ ‘అన్నా చెల్లెలు’ ‘పచ్చతోరణం’ ‘ఎన్‌కౌంటర్’ వంటి సినిమాల్లో హీరోగా నటించారు. అయితే నటుడిగా కలిసి రాకపోవడంతో నిర్మాతగా అవతారమెత్తారు రమేష్ బాబు. మహేష్ బాబు నటించిన పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: