స్టార్ హీరో నాగార్జున నటిస్తున్న ‘బంగార్రాజు’ సినిమా సంక్రాంతి రేసులో ఉండబోతుంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా సీక్వెల్‌గా రాబోతుంది. జనవరి 14వ తేదీన రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తున్నారు. కాగా, ఇటీవల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఇందులో బంగార్రాజు సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.


డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. 2016 సంవత్సరంలో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా విడుదలైందన్నారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడే హీరో నాగార్జునకు బంగార్రాజు స్టోరీ చెప్పానన్నారు. అప్పుడే నాగార్జున ఓకే చెప్పినట్లు పేర్కొన్నారు. అలాగే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాను బంగార్రాజు సీక్వెల్‌గా రాబోతుందన్నారు. సోగ్గాడే సినిమా ఎక్కడ ఎండ్ అయిందో.. అక్కడి నుంచే ‘బంగార్రాజు’ సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో జనరేషన్ తేడా ఉంటుందని, కానీ బంగార్రాజు పాత్రలో ఎలాంటి తేడా ఉండదని పేర్కొన్నారు.


ఈ సినిమాలో బంగార్రాజు మనవడిగా చైతూ కనిపించనున్నట్లు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ పేర్కొన్నారు. పెద్ద బంగార్రాజు పాత్ర ఎలా ఉంటుందో.. చిన్న బంగార్రాజు పాత్ర కూడా అలాగే ఉంటుందన్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరి పాత్ర తగ్గకుండా ఉంటుందన్నారు. ప్రతీ సీన్, ఎమోషన్ ఈ రెండు పాత్రలకు సమానంగా ఉంటుందన్నారు. కాగా, ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర కూడా సేమ్‌గా కొనసాగుతుందన్నారు.


కాగా, సంక్రాంతి రేసులో ఇప్పటికే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ సినిమాలు రిలీజ్ కావాల్సి ఉండేవి. కానీ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంది. దీంతో ఈ స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో బంగార్రాజు సినిమా మార్గం సుగమమైంది. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి బంగార్రాజు సినిమాపై ఉంది. నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి వంటి స్టార్స్ నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: