నాగార్జున హీరోగా 2016లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వల్ గా బంగార్రాజు వస్తున్నాడు. సినిమాలో నాగార్జునతో పాటుగా నాగ చైతన్య కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించారు.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 39 కోట్లు బిజినెస్ చేసింది. నాగార్జున, నాగ చైతన్య కెరియర్ లో ఇది హయ్యెస్ట్ బిజినెస్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న ఈ టైం లో సంక్రాంతికి డేర్ చేసి రిలీజ్ చేస్తున్నాడు నాగార్జున. కొన్నాళ్లుగా బాక్సాఫీస్ దగ్గర సరైన సక్సెస్ లు లేని నాగార్జున.. ఓ పక్క వరుస హిట్లతో సూపర్ జోష్ లో ఉన్న నాగ చైతన్య ఇద్దరు కలిసి చేస్తున్న సినిమాగా బంగారాజుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తప్పకుండా ఈ సినిమా అక్కినేని ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ అందించేలా ఉందని అంటున్నారు. ఈ సినిమా తర్వాత నాగార్జున ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో ది ఘోస్ట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు నాగ్.

ఏరియాల వారిగా బంగార్రాజు ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్ :

నైజాం : 11 కోట్లు
సీడెడ్ : 6 కోట్లు
ఉత్తరాంధ్ర : 4.14 కోట్లు
గుంటూర్ : 3.24 కోట్లు
ఈస్ట్ : 2.88 కోట్లు
వెస్ట్ : 2.60 కోట్లు
కృష్ణ : 2.70 కోట్లు
నెల్లూరు : 1.50 కోట్లు
ఏపీ+తెలంగాణ టోటల్ : 34 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 2.50 కోట్లు
ఓవర్సీస్ : 2.50 కోట్లు
వరల్డ్ వైడ్ : 39 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి: