కన్నడ భామ రష్మిక మందన్న లీడ్ రోల్ లో రాహుల్ రవీంద్రన్ డైరక్షన్ లో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో రష్మిక చాలా బలమైన పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది. ఫీమేల్ సెంట్రిక్ మూవీగా వస్తున్న ఈ సినిమా 1995 బ్యాక్ డ్రాప్ లో వస్తుందని టాక్. సినిమాలో రష్మిక ఓ కిరాణ కొట్టు వ్యాపారి కూతురిగా నటిస్తుందట. ఆమె ఓ బిజినెస్ లో చాలా గొప్ప స్థాయికి వెళ్తుందట. ఈ కథతోనే రష్మిక, రాహుల్ సినిమా ఉంటుందని అంటున్నారు.

తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక వరుస సక్సెస్ లతో దూసుకెళ్తుంది. లేటెస్ట్ గా పుష్ప సినిమాతో కూడా అమ్మడు తన ఖాతాలో మరో హిట్ దక్కించుకుంది. పుష్ప పాత్రలో రష్మిక తన డీ గ్లామర్ లుక్ తో సత్తా చాటింది. తెలుగుతో పాటుగా తమిళంలో కూడా ఛాన్సులు అందుకుంటుంది రష్మిక. ఇదే కాదు హిందీలో కూడా గుడ్ బై, మిషన్ మజ్ ను సినిమాలు చేస్తుంది.

రష్మిక చేయబోతున్న ఈ సరికొత్త సినిమా మాత్రం ఆమెకు మంచి మైలేజ్ ఇస్తుందని అంటున్నారు. రష్మిక కెరియర్ లో ఇదే ఫస్ట్ టైం ఇంత వెయిట్ ఉన్న పాత్రలో నటిస్తుందని అంటున్నారు. ఈ సినిమా తర్వాత రష్మిక ఇమేజ్ డబుల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. తప్పకుండా రష్మిక తన టాలెంట్ తో ఈసారి మరింత క్రేజ్ తెచ్చుకుంటుందని అంటున్నారు. కన్నడ భామే అయినా తెలుగులో టాప్ రేంజ్ కి వెళ్లిన రష్మిక తను చేయబోతున్న సినిమాలతో మరింత ఫాలోయింగ్ పెంచుకుంటుంది. తమిళంలో కూడా రష్మిక ఏది పడితే అది కాకుండా కథానాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేయాలని ఫిక్స్ అయ్యింది. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు తాను రెడీ అంటుంది అమ్మడు. మరి మిగతా హీరోయిన్స్ లా రష్మిక ఇలా కూడా ఫ్యాన్స్ ను అలరిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: