ఇండస్ట్రీలో నటుల పిల్లలు వాళ్ళ వారసులుగా ఇండస్ట్రీలో అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. అయితే అందులో కొంతమంది నటుల పిల్లలు అర్ధాంతరంగా అనారోగ్యంతో మృతి చెంది వారిని శోక సముద్రంలో నెట్టేస్తున్నారు. ఇండస్ట్రీలో చాలా మంది సినీ ప్రముఖులకు పుత్రశోకంతో కుమిలిపోతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కొడుకులను కోల్పోయిన సినీ ప్రముఖుల గురించి ఒక్కసారి చూద్దామా.

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరోగా నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణించిన రమేష్ బాబు 56 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మృతి చెందాడు. రమేష్ మృతితో సూపర్ స్టార్ కృష్ణ ఎంత బాధలో ఉన్నారు. అలాగే ప్రముఖ డాన్స్ మాస్టర్ ప్రభుదేవా కొడుకు చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు మరణంతో ఇద్దరి దంపతుల మధ్య తలెత్తాయి.

ఇక సీనియర్ ఎన్టీఆర్ విషయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఎన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ  అరుదైన వ్యాధితో బాధపడుతూ  మృతి చెందారు. కొడుకు మరణం నుండి బయటపడటానికి ఎన్టీఆర్ కి చాలా సమయం పట్టింది. ఎన్టీఆర్ కొడుకైన హరికృష్ణ విషయంలోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. హరికృష్ణ పెద్దకొడుకు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆయన శోక సముద్రంలో మునిగిపోయారు. ప్రముఖ నటుడు గోల్లపూడి మారుతి రావుకు కూడా చేతికొచ్చిన కొడుకును కోల్పోయారు.

ఇండస్ట్రీలో సీనియర్ రైటర్స్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు రఘు బాబు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన తమ వారసుడిని గుర్తు చేసుకుంటూ ఆయన పేరుమీద నాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు కోట ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు మరణం నుండి తేరుకోవడానికి కోటాకు చాలా సమయమే తీసుకున్నారు. ప్రముఖ కమెడియన్ బాబు మోహన్ కొడుకు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కొడుకు మృతిని తట్టుకోలేక ఆయన విలపించిన తీరు అభిమానులను కలిచివేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: