ఇటీవల కాలంలో కొన్ని సినిమాల నుండి విడుదలైన పాటలు యూట్యూబ్ లో ఎంతలా సెన్సేషన్ సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు అనే పాట విడుదలై యూట్యూబ్ లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది. ఈ పాట పై టాలీవుడ్ లో స్టార్ డాన్సర్ లుగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి అదిరిపోయే స్టెప్పులు వేయడం మరింతగా అందరినీ ఆకర్షించింది. ఇక సంగీత ప్రేక్షకులందరినీ కూడా నాటు నాటు పాట ఉర్రూతలూగించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం నాటు నాటు అనే పాట విడుదల అయింది లేదో కేవలం నిమిషాల వ్యవధిలోనే ఎన్నో రకాల స్ఫూఫ్ లు దర్శనమిచ్చాయి అన్న విషయం తెలిసిందే.



 ఎంతోమంది జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ చేసిన స్టెప్పులను తమదైన శైలిలో చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి కూడా చేశారు.  మరి కొంతమంది కొన్ని సినిమాలోని క్లిప్పింగ్స్ ని తీసుకొని ఒక వీడియో ఎడిట్ చేసి నాటు నాటు పాట జతచేసి సోషల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఎన్నో వైరల్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. ఆర్.ఆర్.ఆర్ సినిమా లోనుంచి నాటు నాటు పాటపై ఒకవేళ బ్లాక్ అండ్ వైట్ సినిమా లో డాన్స్ చేస్తే ఎలా ఉండేది అన్నది ఈ వీడియోలో కనిపిస్తోంది.



 ఈ వీడియో లో భాగంగా ఇద్దరు నటులు నాటుకునే పాట పై డాన్స్ చేస్తారు. ఇద్దరు డాన్స్ చేసిన తీరు అందరిని ఆకట్టుకోవడమే కాదు ఎంతో మందిని కడుపుబ్బ నవ్విస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి కలేదు. ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు ఈ వీడియో చూసిన తర్వాత ఇదే పర్ఫెక్ట్ రీమిక్స్ అంటూ కామెంట్ పెడుతూ ఉండడం గమనార్హం. ఈ పాట పై బ్లాక్ అండ్ వైట్ రీమిక్స్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఇక సినిమా విషయానికొస్తే రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7వ తేదీన విడుదల అవుతుంది అని అనుకున్నా చివరికి  వాయిదా పడటం సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: