ప్ర‌స్తుతం హీరోయిన్ల ఫొటోలు నిత్యం నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంకా ఇంట‌ర్నెట్ ట్రెండ్ పెరిగింది. ఈ త‌రుణంలోనే హీరోయిన్స్ చిన్న‌ప్ప‌టి పొటోలు తెగ వైర‌లవుతున్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల‌లో ఓ చిన్నార ఫొటో తెగ ట్రెండ‌వుతున్న‌ది. ఈ చిన్నారి గ‌త ఏండ్ల కాలం నుంచి సౌత్ ఇండియా సినీ ఇండ‌స్ట్రీలో టాప్ స్టార్‌గా రాణిస్తున్న‌ది. అందం, అభిన‌యంతో ఎంతో మంది ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను దోచుకున్న‌ది. దాదాపు తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీల‌లో స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న కూడా న‌టించింది. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాకు హీరోయిన్ అంటే ముందు ఈమె పేరునే గుర్తుకు చేసుకునే వారు. ఇప్పుడు కూడా సీనియ‌ర్ హీరోల‌కు బెస్ట్ ఆప్ష‌న్‌. ఇంకా ఈ అమ్ముడు ఎవ్వ‌రో గుర్తు ప‌ట్టలేదా.. అయితే మేమే చెబుతాం.

ఈ ఫొటోలో క‌నిపిస్తున్న పాపాయి 1983లో మే 04న మ‌ద్రాస్‌లో పుట్టింది. ఆమె చెన్నై చంద్రం త్రిష కృష్ణ‌న్‌.  ఆమె 1999 నుంచే సినిమాల్లో న‌టిస్తూ వ‌స్తోంది. 2003లో వ‌చ్చిన నీ మ‌న‌సు నాకు తెలుసు సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయింది కానీ వ‌ర్షం సినిమాతో స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకున్న‌ది. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అయింది. మ‌రొక విశేష‌మేమిటంటో తెలుగు ప్రేక్ష‌కుల‌కు వ‌ర్షం సినిమాతోనే ఆమె ఎక్కువ‌గా ప‌రిచ‌యం. తొలుత విడుద‌లైన నీ మ‌న‌స్సు నాకు తెలుసు  చిత్రంలో అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. వ‌ర్షం సినిమా త‌రువాత తెలుగులో త్రిష‌కు ఆఫ‌ర్లు ఒక రేంజ్‌లో వ‌చ్చాయి.

 దాదాపు తెలుగులో స్టార్స్ అంద‌రితో క‌లిసి త్రిష‌ న‌టించింది. త్రిష‌, ఇటు కుర్ర హీరోలు, అటు వెట‌ర‌న్ స్టార్స్ చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌, నాగార్జున, ర‌జినికాంత్ వంటి స్టార్ హీరోల‌తో రొమాన్స్ చేసి రెండు త‌రాల హీరోయిన్‌గా స‌త్తా చాటింది. అదేవిధంగా త‌మిళంలోనూ ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. ఆ త‌రువాత ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదిలో అగ్ర‌హీరోల‌తో న‌టించే అవ‌కాశం చేజెక్కించుకుంది. 96 సినిమాతో చాలా గ్యాప్ త‌రువాత భారీ విజ‌యాన్ని అందుకున్న‌ది. ఈ మ‌ధ్య‌కాలంలో టాలీవుడ్‌కు దూరంగా ఉంటూ కేవ‌లం త‌మిళ సినిమాలే చేస్తోంది త్రిష‌. మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న ఆచార్య సినిమాలో ఛాన్స్ వ‌చ్చినా వ‌దులుకున్న‌ది. ప్ర‌స్తుతం త్రిష న‌టించిన నాలుగు త‌మిళ సినిమాలు, 01 మ‌ళ‌యాళ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు త్రిష చిన్న‌నాటి ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ మారింది. ఇటీవ‌లే త్రిష‌కు క‌రోనా పాజిటివ్ సోకింది.


మరింత సమాచారం తెలుసుకోండి: