టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ 2012లో తీసిన భారీ మాస్ ఎంటర్టైనర్ మూవీ గబ్బర్ సింగ్. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై కమెడియన్ కం నిర్మాత అయిన బండ్ల గణేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా రిలీజ్ తరువాత ఎంతో పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి చాలా ఏరియాల్లో అప్పటివరకు టాలీవుడ్ లో ఉన్న గత రికార్డ్స్ అన్ని కూడా బద్దలుకొట్టింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో గబ్బర్ సింగ్ అనే మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్ కి ప్రేక్షకాభిమానుల నుండి విపరీతమైన ప్రశంసలు కురిసాయి.

ఇక ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్, బీజీఎమ్ అయితే ఎప్పటికీ మరచిపోలేము అనే చెప్పాలి. ఇక మళ్ళి పదేళ్ల తరువాత త్వరలో మరొకసారి పవన్, హరీష్ శంకర్ ల క్రేజీ కాంబోలో తెరకెక్కనున్న సినిమా భవదీయుడు భగత్ సింగ్. పవర్ స్టార్ ఒక పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మించనున్నారు. ఇటీవల అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ పవన్ కి జోడీగా జతకట్ట నుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ సినిమా విషయమై ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ, ఈ మూవీలో మ్యూజిక్ కి మంచి స్కోప్ ఉందని, అలానే పవన్ కళ్యాణ్ గారికి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉండడంతో తప్పకుండా సినిమాలో సాంగ్స్, బీజీఎమ్ ఎంతో అదిరిపోయేలా ఇప్పటి నుండి మంచి కేర్ తీసుకుంటున్నాం అని, అతి త్వరలో మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం కానున్న ఈ సినిమా ప్రస్తుత కోవిడ్ పరిస్థితులు అన్ని సర్దుకుంటే మరొక రెండు నెలల అనంతరం పట్టాలెక్కే ఛాన్స్ ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ లో అయితే విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మరి ఇంకా ప్రారంభం కూడా కాకముందే అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరుచుకున్న ఈ సినిమా రేపు తెరకెక్కి, ఆపై రిలీజ్ తరువాత ఎన్ని రికార్డ్స్ కొడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: