టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బంగార్రాజు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిస్తుండగా మరో కీలక పాత్రలో అక్కినేని నాగ చైతన్య కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెంచేశాయి. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగివున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇది ఇలా ఉంటే బంగార్రాజు సినిమాలో ఒకరు కాదు... ఇద్దరు కాదు... ఏకంగా 8 మంది హీరోయిన్లు సందడి చేయనున్నారట.

ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతి శెట్టి మెయిన్ లీడ్ హీరోయిన్ లుగా నటించగా జాతి రత్నాలు సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఫారియా అబ్దుల్లా స్పెషల్ సాంగ్ తో అలరించింది. ఇప్పటికే ఈ సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేయగా దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. వీరితో పాటు మీనాక్షి దీక్షిత్‌, దర్శన బానిక్‌, వేదిక, దక్ష నాగార్కర్‌, సిమ్రత్‌ కౌర్‌ వంటి హీరోయిన్ లు కూడా ఈ సినిమాలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. గతంలో నాగార్జున నటించిన కింగ్ సినిమాలో కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లు చాలామంది ఒక పాటలో కనిపించారు. ఇప్పుడు బంగార్రాజు సినిమాకు కూడా నాగార్జున అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే బంగార్రాజు సినిమా 2016 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: