మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలలో నటిస్తూ బిజిగా ఉన్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.అప్పటి వరకు పరిస్థితులు బాగుంటే సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుంది. లేదంటే మరోసారి వాయిదా పడడం ఖాయం. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని కొన్ని కీలకమైన విషయాల గురించి రామ్ చరణ్ మీడియా ముందు పంచుకున్నాడు. తొలిసారి తండ్రితో కలిసి నటించడం ఆనందంగా ఉందని ఆయన సినిమా లతో ఎంతో నేర్చుకున్నా అని చరణ్ అన్నాడు..


ఆచార్య సినిమాలో సిద్ధ పాత్రలో నటిస్తున్నాడు రామ్‌చరణ్‌. ఈ క్యారెక్టర్ కోసం తనను తాను చాలా మార్చుకున్నట్లు చెప్పాడు రామ్ చరణ్. ఇందులో తన తండ్రితో పాటు తాను కూడా నక్సలైట్ గా నటిస్తున్నట్లు ఓపెన్ అయ్యాడు చరణ్. కథాపరంగా తాము ఎందుకు నక్సలైట్ గా మారాల్సి వచ్చిందో సినిమా చూస్తే అర్థమవుతుంది అంటున్నాడు మెగా వారసుడు.. కానీ చిరు పాత్ర మాత్రం అందరిని మెప్పించేలా ఉందని చెప్పుకొచ్చారు.. అలాంటి పాత్రలో ఆయన కనిపించ లేదని చెప్పాడు.


చరణ్ కన్నా ముందు ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేయడం తో ఇప్పుడు రామ్ చరణ్సినిమా చెస్తున్నారు.ఈ కథలో నిన్ను తప్ప వేరే వాళ్ళు ఊహించుకో లేకపోతున్నాను. ఈ కథ విన్న తర్వాత నువ్వే డిసైడ్ చేసుకో అని కొరటాల శివ ఒకరోజు తనకు ఫోన్ చేసి అడిగాడని.. ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న తాను రాజమౌళి పర్మిషన్ తీసుకొని ఆచార్య సినిమాలో నటించినట్లు చెప్పాడు. ఏదేమైనా మెగా అభిమానులకు ఇది అద్భుతమైన ట్రీట్ అంటున్నాడు చరణ్. సినిమా ఎప్పుడు వచ్చిన విజయం సాధించడం ఖాయం అంటున్నాడు. మా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో తెలియాల్సి ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: