అయితే ఈఫంక్షన్ ఈమూవీ రిలీజ్ లోపున మళ్ళీ ఉంటుందా లేదా అన్న విషయమై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. చిన్ననాటి నుండి తన మేనమామ మహేష్ సినిమాలు చూస్తూ పెరిగిన అశోక్ ఈ సినిమా కోసం చాలా శ్రమించాడు. నటన డ్యాన్సులు సహా ప్రతిదీ తర్ఫీదు పొంది హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెండు సంవత్సరాల క్రితం ఈ ‘హీరో’ మూవీ మొదలైనప్పటికీ కరోనా పరిస్థితులు అడ్డు తగలడంతో ఈమూవీ విడుదల చాల ఆలస్యం అయింది.
సంక్రాంతికి రావలసిన భారీ సినిమాలు అన్నీ వాయిదా పడటంతో ఇప్పుడు ఈ సీజన్ కు రాబోతున్న చిన్న సినిమాలతో అశోక్ పోటీ పడుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడి ఎంట్రీ కాబట్టి ఈ ఫంక్షన్ ను అత్యంత ఘనంగా నిర్వహించి ఈ ఈవెంట్ కు మహేష్ ను అతిధిగా పిలవాలని భావించారు. అయితే మహేష్ కు కరోనా రావడంతో అతడు లేకుండానే ఫంక్షన్ ను నిర్వహించాలి అనుకున్నారు.
ఇప్పుడు మరణించడంతో ఈ ఈవెంట్ ను క్యాన్సిల్ చేయడం ఒక విధంగా ఈ యంగ్ హీరోకి షాక్ అనుకోవాలి. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యతిరేక పరిస్థితులలో ఎంతవరకు మహేష్ అభిమానులు గల్లా అశోక్ ను ఓన్ చేసుకుంటారు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన ట్రైలర్ యూత్ కు బాగా నచ్చడంతో రాబోయే రోజులలో అశోక్ కూడ యంగ్ హీరోల లిస్టులో చేరి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకుంటాడని అతడి సన్నిహితులు భావిస్తున్నారు..