తెలుగు సినిమాలో పాటలకు హీరోలు విపరీతంగా స్టెప్స్ వేసే సాంప్రదాయానికి 1970 ప్రాంతాలలో వచ్చిన ‘దసరా బుల్లోడు’ ఒక ట్రెండ్ సెటర్. ఆమూవీలో అక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రీ తో వేసిన స్టెప్స్ ఆనాటి యూత్ కు మాస్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు అదే ‘దసరాబుల్లోడు’ డేట్ సెంటిమెంట్ ను నాగార్జున తన ‘బంగార్రాజు’ మూవీ కోసం అనుసరిస్తున్నట్లు స్వయంగా ప్రకటించాడు.


అక్కినేని కుటుంబానికి జనవరి 14 డేట్ చాల కలిసివచ్చిన డేట్ అని చెపుతూ ఆ డేట్ న 50 సంవత్సరాల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభం అయితే అదే డేట్ న ‘దసరాబుల్లోడు’ విడుదల అయిందని ఆ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకుని ‘బంగార్రాజు’ రిలీజ్ డేట్ ను ఎలాంటి వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పటికీ ధైర్యంగా ఫిక్స్ చేసాను అని అంటున్నాడు.


వాస్తవానికి ఈమూవీకి భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలని భావించారని అయితే అనుమతులు లభించకపోవడంతో ఈమూవీ పాటల ఆల్బమ్ సక్సస్ మీట్ తో తాను సరిపెట్టుకున్నాను అంటూ ప్రస్తుత పరిస్థితుల పై తన అసంతృప్తిని వ్యక్తపరిచాడు. తన సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విందు భోజనం లా ఉంటుందని చెపుతూ సంక్రాంతికి తయారు చేసే సంక్రాంతి పిండివంటలను తింటూ కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ మర్చిపోకుండా మాస్క్ పెట్టుకుని తన సినిమాను ఎంజాయ్ చేసి అందర్నీ జాగ్రత్తగా ఉండమంటున్నాడు.


నాగార్జున సినిమాకు ఫ్యామిలీ ప్రేక్షకులు బాగా వస్తే కానీ ఆ సినిమాకు కోరుకున్న కలక్షన్స్ రావు. అయితే  తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతున్న కరోనా భయాలు పెరిగిపోతున్న కేసుల మధ్య ఎంతవరకు ఈమూవీకి ఫ్యామిలీ ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. అన్న విషయం ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న. ఎన్ని వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పటికీ ఒక అద్వితీయ శక్తిని నమ్ముకుని నాగ్ చేస్తున్న సాహసం ఈసినిమాలోని అద్వితీయ శక్తుల పాయింట్ కు బలం చేకూర్చే విధంగా ఉంది..



మరింత సమాచారం తెలుసుకోండి: