లెజెండరీ హీరో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, సూపర్ స్టార్ మహేష్ అన్న రమేష్ బాబు కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ చనిపోయిన సంగతి తెలిసిందే. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా నిర్ధారణ కావడంతో రమేష్ బాబు అంత్యక్రియలకు హాజరు కాలేదు.ఇక రమేష్ బాబు నాలుగు సినిమాలలో చిన్నప్పటి కృష్ణగా నటించారు. కొన్ని సినిమాలలో తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి రమేష్ బాబు హీరోగా నటించడం గమనార్హం. అయితే హీరోగా రమేష్ బాబు మాత్రం కృష్ణ మహేష్ లాగా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు.ఇక తమిళంలో రమేష్ బాబు శాంతి ఎనదు శాంతి అనే ఒకే ఒక్క సినిమాలో నటించారు. టి.రాజేందర్ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.అలాగే సీనియర్ ఎన్టీఆర్ హీరోగా రక్త సంబంధం పేరుతో తెరకెక్కిన సినిమాను రమేష్ బాబు 1993 సంవత్సరంలో అన్నాచెల్లెలు పేరుతో అప్పుడు రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడం గమనార్హం. ఇక మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు అనేవి జరిగాయి. పలువురు సెలబ్రిటీలు రమేష్ బాబు మృతికి తమ సంతాపం తెలియజేశారు.

చిన్నప్పటి నుంచి రమేష్ బాబు మహేష్ బాబు మంచి స్నేహితులలా ఉండేవారని సమాచారం. చాలా సందర్భాల్లో రమేష్ బాబుకు తన వంతు సహాయం చేసి మహేష్ బాబు ఎంతగానో అండగా నిలిచారు. రమేష్ బాబు నిర్మాతగా మహేష్ బాబు హీరోగా అర్జున్, అతిథి సినిమాలు తెరకెక్కాయి. ఈ రెండు సినిమాల నిర్మాతగా రమేష్ బాబుకు నష్టాలను మిగల్చటంతో మహేష్ బాబు చాలా ఫీలయ్యారని సమాచారం. దూకుడు ఇంకా ఆగడు సినిమాలకు రమేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరించగా దూకుడు సినిమా మాత్రం సూపర్ సక్సెస్ సాధించింది.ఇక రమేష్ బాబును స్టార్ ప్రొడ్యూసర్ ను చేయాలని భావించగా మహేష్ బాబు కోరిక నెరవేరకుండానే రమేష్ బాబు చనిపోయారు. రమేష్ బాబు మృతితో సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కొత్త ఏడాదిలో మహేష్ బాబుకు కరోనా సోకడం, రమేష్ బాబు చనిపోవడం మహేష్ అభిమానులను చాలా బాధ పెడుతోంది. మహేష్ బాబు త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: