టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా కళ్యాణ్, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బంగార్రాజు. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిస్తుండగా మరో ముఖ్యమైన పాత్రలో అక్కినేని నాగ చైతన్య కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య సరసన  కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ చిత్ర బృందం మూవీ మ్యూజికల్ ఈవెంట్ ను నిర్వహించింది.


ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. అభిమానులందరినీ ఈ మ్యూజికల్ ఈవెంట్ కు పిలవలేక పోయాం, అందరూ క్షమించండి. జనవరి 14 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇది అన్నపూర్ణ స్టూడియోస్ కు చాలా ముఖ్యమైన తేదీ. అన్నపూర్ణ పుట్టింది అదేరోజు. దసరా బుల్లోడు చిత్రంతో యాభై ఏళ్ల క్రితం నాన్న గారు సంక్రాంతికి దుమ్ములేపారు. ఆ సినిమా కూడా మ్యూజికల్ హిట్. సినిమా సక్సెస్ మీట్ లో అందరికీ థాంక్స్ చెబుతాను. మూవీ కి సగం సక్సెస్ మ్యూజిక్. ఆ సగం సక్సెస్ ను అనూప్ రూబెన్స్ కి ఇస్తున్నాం. ఈ సినిమాకు చక్కటి మాస్ కమర్షియల్ సాంగ్స్ ఇచ్చారు. ప్రతి ఒక్క సాంగ్ వజ్రంలా ఉంటుంది. ఈ సినిమా ట్రైలర్ జనవరి 11 వ తేదీన రాబోతుంది. జనవరి 14 వ తేదీన పండగ రోజున పండగ లాంటి సినిమా తీసుకొస్తున్నాం అందరూ ఆదరించండి అని నాగార్జున తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: