ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీన విడుదలైంది. విడుదలైన తొలి రోజు నుంచే అన్ని భాషలలోనూ మంచి స్పందన దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓ టీ టీ లోనూ అదే రకమైన స్పందన దక్కించుకుంటుంది. ఈ శుక్రవారం ఓ టీ టీ లో విడుదలైన ఈ సినిమా యావత్ భారతావని తిలకిస్తూ అల్లు అర్జున్ నటనను, సుకుమార్ దర్శకత్వం ను పోగుడుతుంది. ఆ విధంగా అల్లు అర్జున్ అందరూ ఆశ్చర్యపోయేలా తన సూపర్ హిట్ సినిమను కేవలం 25 రోజుల వ్యవధిలోనే విడుదల చేయడం విశేషం.

అయితే గతంలో నాని విషయంలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు నాని అభిమానులు గుర్తు చేస్తున్నారు. టక్ జగదీష్ విషయంలో ఆయన చేసిన పనిని తప్పు పడుతూ ఆ సినిమాకు సంబంధించిన పంపిణీదారులు, థియేటర్ యాజమాన్యం పెద్ద గొడవ చేశారు. ఆయన నటించిన సినిమాలు డైరెక్ట్ గా ఓ టీ టీ లో విడుదల చేయడమే ఆ వివాదానికి ప్రధాన కారణం అయితే అప్పుడు థియేటర్ల సమస్య ఉండడంతో తన సినిమాను ఓ టీ టీ లో విడుదల చేస్తున్నారని వెల్లడించినా నాని పై ప్రతి ఒక్కరు కూడా విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ను ఎందుకు విమర్శించడం లేదని నాని అభిమానుల ప్రశ్న.

వాస్తవానికి పుష్ప లాంటి భారీ చిత్రాన్ని ఓ రెండు మూడు నెలలైనా ఆపి ఓ టీ టీ లో విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ చిత్రాన్ని 25 రోజుల తర్వాత విడుదల చేయటం అల్లు అర్జున్ అభిమానులకు కూడా పెద్దగా మింగుడు పడడం లేదు. ఇంత పెద్ద సూపర్ హిట్ చిత్రాన్ని అంత అలవోకగా అంత తొందరగా విడుదల చేయడం పట్ల వారు కూడా ఎంతో నిరాశ పడ్డారు. అయితే దీనిపై నాని ఫ్యాన్స్ పెద్ద హీరో అని ఎవరూ నోరు మెదపడం లేదు. పెద్ద హీరోలకు ఒకలా, చిన్న హీరోలకు ఒకలా రూల్స్ ఉంటాయా అని సదరు విమర్శకుల పై విరుచుకుపడుతున్నారు.దీనికి సదరు సినిమా విమర్శకులు ఏమని సమాధానం చెబుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: