టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఒక పక్క సంతోషం ఉంటే.. మరోవైపు దుఃఖం ఉంటుంది. నటీనటులు, ఆర్టిస్టులు ఇలా చాలా మంది తమ కెరియర్‌ను స్టార్ట్ చేస్తుంటారు. ఇండస్ట్రీలో లాభపడిన వారు ఎంత మంది ఉంటారో.. నష్టపోయిన వారి సంఖ్య కూడా అంతే ఉంటుంది. ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఎవరూ చర్యలు తీసుకుంటారనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఒకప్పుడు దర్శకుడు దాసరి నారాయణరావు చాలా వరకు ఇండస్ట్రీలోని సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టేవారు. దాసరి స్వర్గీయులు అయిన తర్వాత ఆ సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదు.

దాసరి మరణాంతరం ఆ సీట్ ఖాళీ అయింది. ఆ స్థానాన్ని భర్తీ చేసే దిశగా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఈ సీట్ కోసం మెగాస్టార్ చిరంజీవి, మెహన్ బాబు పోటీ చేశారు. కానీ, రీసెంట్‌గా ఈ విషయంపై చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. తాను ఇండస్ట్రీకి పెద్దగా ఉండనని చెప్పుకొచ్చారు. సినీ ఇండస్ట్రీకి తన బాధ్యతగా సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటానని అన్నారు. కానీ ఇద్దరి గొడవల మధ్య తల దూర్చనని చెప్పారు. అలా ఇండస్ట్రీ పెద్దరికం అనే విషయంలో సీనియర్ దర్శకులు, ప్రముఖ నిర్మాతలు పలు సందర్భాలల్లో తమ అభిప్రాయాలను వెల్లడించారు.

తాజాగా ఈ విషయంపై సీనియర్ దర్శకుడు తేజ స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో ఈ మధ్యలో ఇండస్ట్రీ పెద్దరికం సీటు గురించి పలు అంశాలు వినిపిస్తున్నాయి. దాసరి నారాయణ మహానుభావుడని, ఆయన ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యాయని పేర్కొన్నారు. దాసరి చూస్తేనే సింహంలా కనిపిస్తాడని పేర్కొన్నారు. ఆయనను చూస్తే కాళ్ల మీద పడాలనిపిస్తుందన్నారు. ఆయన రూటే సపరేట్ అన్నారు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్లినా సమస్య పరిష్కరం అవుతుందన్నారు. నేరుగా పీఎం, సీఎంతో మాట్లాడేవారన్నారు. అలాంటి వాళ్లు మళ్లీ పుట్టాలన్నారు. ఈ మధ్య కొందరు ఇండస్ట్రీలో వచ్చి.. ఇండస్ట్రీ నాదంటే.. నాదంటూ చెప్పుకొస్తున్నారు. ఎవరున్నా.. లేకున్నా.. ఇండస్ట్రీ పర్మినెంట్. అని డైరెక్టర్ తేజ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: