టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బంగార్రాజు. ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య కూడా ఒక ప్రముఖ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిస్తుండగా, నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార  చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు అమాంతం పెంచేశాయి. ఇలా ప్రేక్షకుల్లో మంచి వజ్రాలు కలిగి ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ పెంచింది. నిన్న అనగా 9 జనవరి 2021 వ తేదీన ఈ చిత్ర బృందం మ్యూజికల్ ఈవెంట్ ను నిర్వహించింది.

  అలాగే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా టీజర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసి ఈ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేసింది. ఇలా ఎప్పటికప్పుడు బంగార్రాజు చిత్ర బృందం ఏదో ఒక అప్డేట్ ను బయటకు వదులుతూ ఈ సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సమకూర్చిన సంగీతం ఇప్పటికే జనాలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇది ఇలా ఉంటే ఈ సారి సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న సినిమా కూడా బంగార్రాజు కావడం విశేషం. బంగార్రాజు సినిమా 2016 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి కలెక్షన్ ల వర్షం కురిపించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: