అక్కినేని నాగార్జున నాగచైతన్య లు హీరోలుగా నటిస్తున్న బంగార్రాజు చిత్రం జనవరి 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి సందర్భంగా వస్తున్న విషయం తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాకి కూడా సోగ్గాడే చిన్నినాయన సినిమాకు వచ్చిన రెస్పాన్స్ వస్తుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్న చిత్ర యూనిట్ ఏది ఏమైనా సరే అదే సమయానికి విడుదల చేస్తూ తమ ప్రామిస్ నిలబెట్టుకుంటోంది.

మొదటి నుంచి ఈ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకు వస్తామని భావించిన చిత్ర యూనిట్ ఇప్పుడు మాట తప్పకుండా అదే సమయంలో తీసుకు రాబోతున్నడం విశేషం. ఈ చిత్రానికి అన్నీ కలిసి వచ్చాయనే చెప్పాలి. అంతకు ముందు ఈ సినిమాకు పోటీగా రెండు భారీ చిత్రాలు ఉన్నాయి. కానీ అవి పోస్ట్ పోన్ కావడంతో సంక్రాంతి కి వచ్చే పెద్ద హీరోల సినిమా ఇది ఒక్కటే కావడం విశేషం. అదే ఈ చిత్రానికి బాగా ప్లస్ అయ్యింది. అయితే ఈ చిత్రంలో నాగార్జున మరియు నాగచైతన్యల డబుల్ ధమాకా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాడని ముందు నుంచి చిత్ర యూనిట్ చెబుతున్న మాట.

తాజాగా ఇప్పుడు మరొక ధమాకా కూడా ప్రేక్షకులకు ఈ సినిమా ద్వారా అందించ పోతున్నామని తెలియజేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో నాగ చైతన్య నాగార్జున లతో పాటుగా  మరొక నాగార్జున కూడా ప్రేక్షకులకు కనిపించే అవకాశం ఉందట. సోగ్గాడే చిన్నినాయన లో నాగార్జున తండ్రి పాత్రలో కొడుకు పాత్ర లో మెరిశారు. ఇప్పుడునా తండ్రి నాగార్జునసినిమా లోనూ నటిస్తున్నాడట. మరి ఈ మూడు పాత్రలతో ట్రిపుల్ ధమాకా ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ సినిమా వచ్చేంతవరకు వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: