టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ పెద్దబ్బాయి, మహేష్ బాబు సోదరుడు  ఘట్టమనేని రమేష్ బాబు అనారోగ్యంతో శనివారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో ఇబ్బందిపడుతున్న ఆయన శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. రమేష్ బాబు కు భార్య మృదుల, పిల్లలు భారతి, జయ్ కృష్ణ. రమేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అల్లూరి సీతారామరాజు, మోసగాళ్లకు మోసగాడు,  దేవుడు చేసిన మనుషులు లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు.
 తండ్రి వారసత్వాన్ని నటనలో చూపించి భళా అనిపించుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు విరామం తీసుకొని నీడ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇక హీరోగా సామ్రాట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చే ముందు పెద్ద కథ నడిచిందని  అంటుంటారు. కృష్ణ తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేసే ఇదే సమయంలో, అక్కినేని కుమారుడు నాగార్జున, రామానాయుడు వారసుడు వెంకటేష్, ఎన్టీఆర్ తమ్ముడిగా త్రివిక్రమ్ రావ్ ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయం అవుతున్నారు. నా ఇల్లే నా స్వర్గం, అన్నా చెల్లెలు, పచ్చ తోరణం, ముగ్గురు కొడుకులు, చిన్ని కృష్ణుడు , కృష్ణ గారి అబ్బాయి, బజారు రౌడీ లాంటి సినిమాల్లో నటించాడు. తండ్రి కృష్ణ సోదరుడు మహేష్ బాబు తోనూ పర సినిమాల్లో కనిపించారు. ఆయన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో 1997 నుంచి దాదాపుగా నటనకు దూరంగా ఉండిపోయారు. హీరో గా ఇండస్ట్రీలో ఎదిగేందుకు కుటుంబ సభ్యులు కూడా సహాయం చేశారని చెప్పుకొచ్చారు. నిర్మాతగా తన రెండో ఇన్నింగ్స్ ను 2004లో మొదలుపెట్టారు. అప్పట్లో ఎన్టీఆర్,కృష్ణ కు మధ్య అల్లూరి సీతారామరాజు సినిమా పలు సమస్యలు తెచ్చిపెట్టిందని అంటుంటారు. అయితే సామ్రాట్ షూటింగ్ సమయంలో బాలకృష్ణ హీరోగా ఇదే టైటిల్ తో మరొక సినిమా రెడీ అవుతోంది. కృష్ణ కూడా తన పెద్దబ్బాయి రమేష్ బాబు హీరోగా సేమ్ ఇదే టైటిల్ తో ఓ చిత్రాన్ని తీస్తుండడంతో ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారు అంటూ అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. నటుడిగా, హీరోగా,నిర్మాతగా రమేష్ బాబుకు తెలుగు పరిశ్రమతో 40 ఏళ్ల అనుబంధం ఉంది. కృష్ణ వారసుడిగా ఎదిగేందుకు ఎన్నో అవకాశాలున్నా రమేష్ బాబు ఎదగలేకపోయారు. ఇందుకు ప్రధాన కారణం ఆయన సున్నితత్వమే అనే టాక్ సినీ వర్గాల్లో వినపడేది.

అందుకే ఇండస్ట్రీలో ఇమడలేక క్రమంగా కెమెరాకు దూరమయ్యారనేది సన్నిహితుల మాటగా చెబుతుంటారు. ఒక సోదరులు రమేష్ బాబు,మహేష్ బాబు మధ్య మంచి అనుబంధం ఉండేదట. బాలనటులుగా వీరిద్దరూ కలిసి నీడ అనే సినిమాలో నటించారు. రమేష్ బాబు హీరోగా వచ్చిన బజార్ రౌడీ సినిమాలోనూ మహేష్ బాబు కీలక పాత్ర పోషించారు. ఎన్కౌంటర్ సినిమా తర్వాత మరోసారి రమేష్ బాబు తెలుగు తెరపై కనిపించలేదు. సోదరుడితో ఎంతో అనుబంధం ఉన్నప్పటికీ కరోనా కారణంగా మహేష్ బాబు ఆయన అంత్యక్రియలకు పాల్గొనలేకపోయారు. ఇటీవల కరోనా బారిన పడడంతో ప్రస్తుతం మహేష్ బాబు, ఆయన కుటుంబం హోం ఐసొలేషన్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: