స్టార్ హీరో అయిన నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ఈ సినిమా కొనసాగింపు కావడంతో ఆ సినిమా నచ్చిన ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా కోసం బాగా ఎదురు చూస్తున్నారు.

సంక్రాంతి రేసు నుంచి పెద్ద సినిమాలు తప్పుకోవడంతో ఈ సినిమాకు సులభంగానే థియేటర్లు దొరుకుతాయని అందరూ కూడా భావించారు. అయితే వైజాగ్ ఏరియాలో మాత్రం దిల్ రాజు ఎక్కువ కలెక్షన్లు వచ్చే థియేటర్లు రౌడీ బాయ్స్ మూవీకి కేటాయించేలా ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నారని సమాచారం.

వైజాగ్ లో దిల్ రాజు చేతిలో కొన్ని థియేటర్లు కూడా ఉన్నాయి. కొన్ని థియేటర్ల ఓనర్లతో దిల్ రాజుకు అగ్రిమెంట్లు అయ్యాయని సమాచారం. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో ఆ సినిమాల కోసం కేటాయించిన థియేటర్లలో కుదిరితే రౌడీ బాయ్స్ లేదా ఇప్పటికే విడుదలైన సినిమాలు ప్రదర్శించేలా దిల్ రాజు అడుగులు వేస్తున్నారని సమాచారం.. బంగార్రాజు, రౌడీ బాయ్స్ ఎంట్రీతో పుష్ప, శ్యామ్ సింగరాయ్ సినిమాల థియేట్రికల్ రన్ ఈ నెల 13వ తేదీతో దాదాపుగా పూర్తి కానుందని తెలుస్తుంది .

 

ఎగ్జిబిటర్లు దిల్ రాజు మాట కాదని మరో సినిమాకు థియేటర్లను కేటాయిస్తే భవిష్యత్తులో దిల్ రాజు కొనుగోలు చేసిన సినిమాలను ప్రదర్శించటానికి ఇబ్బందులు ఎదురవుతాయని వారు భావిస్తున్నారు. నైజాంలో కూడా దిల్ రాజు చేతిలో ఉన్న థియేటర్లలో రౌడీ బాయ్స్ మూవీ ప్రదర్శితం కానుందట . రికార్డు స్థాయిలో థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. శిరీష్ కొడుకు అశిష్ కు ఈ సినిమాతో మంచి విజయం ఇవ్వాలని దిల్ రాజు బాగా పట్టుదలతో ఉన్నారు.

అయితే రౌడీ బాయ్స్ అంచనాలను మించి సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి మరి.బంగార్రాజు సినిమాకు దిల్ రాజు టెన్షన్ అని నెటిజన్లు సోషల్ మీడియాలో బాగా కామెంట్లు చేస్తున్నారు. సంక్రాంతికి రిలీజవుతున్న ఈ సినిమాలు ఏ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తాయో చూడాలి మరి. ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం బంగార్రాజు సినిమా కొరకు బాగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బంగార్రాజు సినిమాలో ఎనిమిది మంది హీరోయిన్లు నటించడం విశేషం..

మరింత సమాచారం తెలుసుకోండి: