టాలీవుడ్లోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రమే తెలుగు ప్రేక్షకులను తన అందం అభినయంతో కట్టిపడేస్తూ ఉంటారు అంతే కాకుండా హోమ్లీ హీరోయిన్లుగా తక్కువ మంది మాత్రమే పేరు సంపాదించుకుంటూ ఉంటారు. అలా తన సినిమాలతో తన వేషధారణతో హోమ్లీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది లయ. తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే మంచి విజయాలని తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలోనే వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో సూపర్ సక్సెస్ సాధించింది లయ..


 స్వయంవరం అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన లయ మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించడంతో ఎక్కువ అవకాశాలను అందుకుంది.. కానీ ఆ తర్వాత పెళ్లి చేసుకోవడంతో సినిమాలకు దూరమై పోయింది. ఆ తర్వాత మాత్రం ఒకసారి గా తెలుగు వెండితెరపై కనిపించకుందాం పోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన లయ మళ్లీ రీ ఎంట్రీ  ఇస్తుందని అభిమానులు అందరూ ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఈ క్రమంలోనే రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమైంది లయ. కానీ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో హిట్ కాలేకపోయింది.



 దీంతో మళ్లీ తెలుగు ఇండస్ట్రీ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకున్న లయకు ఊహించని షాక్ తగిలింది. దీంతో మళ్లీ సినిమాల జోలికి రాలేదు ఈ సీనియర్ హీరోయిన్.  ఇటీవలే లయ తన కుటుంబానికి సంబంధించిన ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్ గా మారిపోయింది. తన భర్త పిల్లలు ఇద్దరితో కలిసి కనిపిస్తుంది లయ. ఇక ఇందులో ఫ్యామిలీ మొత్తం డ్రెస్ కోడ్ పాటించినట్లు తెలుస్తోంది. ఈ ఫోటో చూసి అభిమానులు అందరూ ఎంతగానో మురిసిపోతున్నారు అని చెప్పాలి. ఇన్నాళ్ల తర్వాత లయ ఫ్యామిలీ తో సహా  కనిపించడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: