సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా కొడుకు అయిన అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతూ చేసిన మొదటి సినిమా 'హీరో'.యువ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 'అమర రాజా మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్' పతాకం పై పద్మావతి గల్లా నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15 వ తేదీన విడుదల కాబోతుంది.ఇక ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. తాజాగా ట్రైలర్‌ ను కూడా చిత్ర బృందం వారు విడుదల చేశారు.దర్శకధీరుడు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిసినిమా ట్రైలర్‌ను విడుదల చేసి హీరో అశోక్ గల్లా ఇంకా 'హీరో' టీమ్‌ మొత్తానికి 'ఆల్ ది బెస్ట్' చెప్పారు.ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే… ఇందులో సినిమా హీరో కావాలని కలలు కనే ఓ కుర్రాడిగా అశోక్ గల్లా…. ఇంకా అతన్ని ఎంకరేజ్ చేసే తల్లిగా పవిత్రా లోకేష్ కనిపిస్తుండగా అతన్ని తిట్టి పోసే తండ్రి పాత్రలో నటుడు నరేష్ కనిపిస్తున్నాడు.

ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ తండ్రిగా ఇందులో జగపతి బాబు కనిపిస్తుండడం విశేషం.ఇక అశోక్ గల్లా రకరకాల గెటప్ లలో కనిపిస్తూ ఎంతగానో అలరిస్తున్నాడు. యాక్షన్ సీక్వెన్స్ లు ఇంకా అలాగే రన్నింగ్ ఇలా అన్ని విధాలుగా అశోక్ లుక్ చాలా ఆకర్షిస్తుంది. ఇక కథలోని లోతుని అంతగా చూపించలేదు కానీ కామెడీ కూడా ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని స్పష్టమవుతుంది. అలాగే జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా నిధి - అశోక్ ల మధ్య వచ్చే లిప్ లాక్ సీన్ ట్రైలర్ కి మంచి హైలెట్ గా నిలుస్తుంది. సంక్రాంతి పండగకి ఇలాంటి కమర్షియల్ గా సాగే వినోదాత్మక సినిమాలకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి..బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యి మేకర్స్ కి మంచి ఫలితాన్నే నమోదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక భవిష్యత్తులో అశోక్ ఖచ్చితంగా సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్ మహేష్ అంత గొప్ప హీరో అవ్వడం ఖాయంలా కనిపిస్తుంది. ఇక చూడాలి అశోక్ లక్ ఎలా ఉంటుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: