టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నందమూరి నటసింహం బాలకృష్ణ-టాలీవుడ్ ఊర మాస్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ సినిమా `అఖండ`. ఇప్పటికి విడుదల అయ్యి నెల దాటింది. ఇక 6వ వీకెండ్ ను కూడా ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది.అఖండ సినిమా తరువాత వచ్చిన 'పుష్ప' 'శ్యామ్ సింగరాయ్' వంటి పెద్ద చిత్రాలు కూడా పోటీగా ఉన్నప్పటికీ…కొత్తగా విడుదలైన సినిమాల్లో ఏ ఒక్కటీ కనీసం కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోకపోవడంతో 'అఖండ' సినిమాకి ఇంకా ఇప్పటికీ కూడా మంచి కలెక్షన్లు వస్తున్నాయి. 6వ వీకెండ్ కు కూడా 240 కి పైగా థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శింపబడింది. ఇక 'ద్వారకా క్రియేషన్స్‌' బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2 వ తేదీ న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఓపెనింగ్స్ కూడా బాగా అదిరిపోయాయి.ఇక దీంతో 8రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 39 రోజుల కలెక్షన్ల వివరాలను కనుక ఓసారి గమనిస్తే..'అఖండ' సినిమాకి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అనేది జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఖచ్చితంగా రూ.54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఇక 8 రోజులకే ఆ టార్గెట్ ను పూర్తిచేసిన ఈ సినిమా ఇక 39 రోజులు పూర్తయ్యేసరికి… మొత్తం రూ.72.13 కోట్ల షేర్ ను రాబట్టింది.ఇక ఓవరాల్ గా చూసుకుంటే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి మొత్తం రూ.18.13 కోట్ల లాభాలు దక్కాయి.అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జనవరి 21 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. కాబట్టి సంక్రాంతి పండుగ సెలవుల్ని కూడా ఈ సినిమా మంచిగా క్యాష్ చేసుకునే అవకాశాలు ఎంతో పుష్కలంగా ఉన్నాయి.ఇక బాలయ్యకి సరైన హిట్ పడితే ఎలా ఉంటుందో ఈ సినిమా నిరూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: