ఇండియాలో రెండే రెండు మతాలున్నాయి. ఒకటి క్రికెట్, మరొకటి సినిమా. సినిమాల్లో హీరోయిజం రూల్‌ చేసినట్లే, క్రికెట్‌లోనూ మెన్ క్రికెట్‌కి ఉన్న ఎక్స్‌పోజర్ విమెన్ క్రికెట్‌కి లేదని చాలామంది విమర్శిస్తుంటారు. కానీ శాలరీస్‌లో తేడాలున్నా, సినిమాల్లోకి వచ్చేసరికి విమెన్‌ క్రికెటర్స్‌ని కూడా సూపర్‌ హిట్‌ స్టోరీస్‌గా మార్చుతున్నారు నిర్మాతలు. ఇండియన్‌ విమెన్‌ క్రికెట్‌లో సీనియర్‌ ప్లేయర్, ఫాస్ట్ బౌలర్ జులన్‌ గోస్వామి కథాంశంతో 'చక్‌ద ఎక్స్‌ప్రెస్‌' సినిమా వస్తోంది. అనుష్క శర్మ లీడ్‌ రోల్ ప్లే చేస్తోంది.

అమ్మాయిలు క్రికెట్‌ గురించి పెద్దగా ఆలోచించని టైమ్‌లోనే బ్యాట్‌ పట్టి, కల సాకారం చేసుకున్న క్రికెటర్ మిథాలీ రాజ్. కెప్టెన్‌గా ఇండియన్‌ విమెన్‌ క్రికెట్ టీమ్‌ని దశాబ్ధాల నుంచి నడిపిస్తోన్న మిథాలీ కథాంశంతోనూ సినిమా వస్తోంది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో 'శభాష్ మిథు'గా వస్తోన్న ఈ బయోపిక్‌లో తాప్సీ టైటిల్‌ రోల్ ప్లే చేస్తోంది. ఇండియన్‌ క్రికెట్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు సౌరవ్ గంగూలి. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా ఇండియన్‌ క్రికెట్‌ని నడిపిస్తోన్నగంగూలీ కథాంశంతోనూ సినిమా వస్తోంది. లవ్‌ రంజన్ నిర్మాణంలో గంగూలీ బయోపిక్‌ వస్తోంది. ఈ క్రికెట్‌ కథలో రణ్‌బీర్‌ కపూర్‌, విక్కీ కౌశల్, సిద్ధార్థ్ మల్హోత్రాల్లో ఎవరో ఒకరు టైటిల్‌ రోల్ ప్లే చేస్తారనే ప్రచారం జరుగుతోంది.  

హాకీ భారతదేశపు జాతీయ క్రీడ. కానీ మనదేశంలో క్రికెట్‌కే ఎక్స్‌పోజర్ ఎక్కువ. గల్లీ నంచి కార్పొరేట్‌ బ్రాండ్స్‌ వరకు అన్నీ క్రికెట్‌ చుట్టూనే తిరుగుతుంటాయి. అయితే ఇంత వ్యాపారం జరుగుతున్నా, ఇండియాకి రెండు సార్లు మాత్రమే వన్‌డే వరల్డ్‌ కప్స్ వచ్చాయి. కానీ విజయాలతో సంబంధం లేకుండా రిచ్చెస్ట్‌ క్రికెట్‌ బోర్డ్‌గా నిలిచింది బిసిసిఐ. ఇప్పుడు బిసిసిఐ లాగే బాక్సాఫీస్‌ కూడా ఫుల్‌రిచ్‌గా మారాలని క్రికెట్‌ కథలవైపు వెళ్తోంది.
మహేంద్ర సింగ్‌ ధోనీకి ఇండియన్‌ క్రికెట్‌ హిస్టరీలో స్పెషల్‌ ఇమేజ్ ఉంది. 'టీ-20, వన్‌డే వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ' అందించిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌ కథని నీరజ్‌ పాండే 'ఎమ్.ఎస్.ధోనీ-ది అన్‌టోల్డ్ స్టోరీ' పేరుతో తెరకెక్కిస్తే సూపర్ హిట్ అయ్యింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ని వెండితెర ధోనీగా మార్చింది. ఇండియన్ క్రికెట్‌గాడ్‌గా పేరు తెచ్చుకున్న హీరో సచిన్ టెండూల్కర్. వన్డే వరల్డ్ కప్‌ని ముద్దాడేవరకు టీమ్‌తోనే ట్రావెల్‌ చేసిన సచిన్‌కి కోట్లమంది అభిమానులున్నారు. ఈ మాస్టర్‌ బ్లాస్టర్‌ కథని 'సచిన్-ఏ బిలియన్ డ్రీమ్స్' పేరుతో తెరకెక్కించారు. ఇందులో సచిన్ కూడా నటించాడు. అయితే క్రికెట్‌ గ్రౌండ్‌లో వేల పరుగులు సాధించిన సచిన్‌ బాక్సాఫీస్‌ దగ్గర ఆరేంజ్‌లో మెప్పించలేకపోయాడు.మరింత సమాచారం తెలుసుకోండి: