సంక్రాంతి కానుకగా చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావాలనీ ప్రయత్నాలు చేయగా చివరి నిమిషంలో అవి ప్రేక్షకుల ముందుకు రావడానికి కుదరలేదు. కారణం ఏదైనా కూడా ప్రేక్షకులను ఎంతగానో నిరాశపరిచిన కొన్ని సినిమాలు ఇప్పుడు తమ సినిమాని పోస్ట్ పోన్ చేసుకోవడం ఎంతో నిరుత్సాహానికి గురి చేస్తుంది. అలా రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తో సహా చిన్న సినిమాలు సైతం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడం లేదో ఇప్పుడు చూద్దాం. 

దక్షిణాదిన భారీ క్రేజ్ సంపాదించుకున్న హీరో అజిత్ నటిస్తున్న తాజా చిత్రం వలిమై సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల చేయాలని చిత్రబృందం ప్రయత్నాలు చేయగా ఎందుకో తెలుగులో ఈ సినిమా విడుదల కావడం లేదు. కారణం ఏదైనా కూడా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూడగా ఇప్పుడు ఆ సినిమా రాకపోవడం వారిని తీవ్రమైన నిరాశకు గురి చేస్తోంది అని చెప్పాలి. ఇక రాజశేఖర్ హీరోగా నటించిన ఆఖరి చిత్రం కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావించి ఆ శ్రమ కూడా థియేటర్లు దొరకడం నేపథ్యంలో విడుదల అవడం లేదు. 

ఇక యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సిద్ధార్థ జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే తిల్లు చిత్రం కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించగా ఎందుకో అది కుదరలేదు. ఒకేసారి భారీగా చిన్న సినిమాలు విడుదల ఉన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడం మంచిది కాదని భావించి చిత్ర యూనిట్ విడుదల పోస్ట్ పోన్ చేసింది. ఇక మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన సూపర్ మచ్చి సినిమా కూడా సంక్రాంతికి విడుదల కావడం లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కాకపోవడంతో ఒక్కసారిగా ఈ సినిమాలన్నీ తమ సినిమాను సంక్రాంతికి విడుదల చేసుకునే విధంగా డేట్ లు ప్రకటించాయి. కానీ ప్రాక్టికల్ గా అన్ని సినిమాలు ఒకేసారి విడుదల కావడం కుదరకపోవడంతో సినిమాలు తమ విడుదలను వాయిదా వేసుకోక తప్పలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: