అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా, నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో రాశి ఖన్నా కు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా టాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాశి ఖన్నా టాలీవుడ్ లో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తో పాటు గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. 
ఈ సినిమాలతో పాటు రాశి ఖన్నా బాలీవుడ్ లో కూడా పలు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. ఇలా సినిమాలతో, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా గడుపుతున్న రాశి ఖన్నా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. తన షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉండే రాశి కన్నా అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా రాశి ఖన్నా  కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే లుక్ లో సారీ కట్టుకొని, అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రాశి ఖన్నా కు సంబంధించిన ఈ క్లాస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: