గత ఏడాది డిసెంబర్ 17న విడుదలైన `పుష్ప - ద రైజ్` సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచి పోయింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ తో తన ఖాతాలో ఫస్ట్ పాన్ - ఇండియా హిట్ ని కూడా జమ చేసుకున్నారు అల్లుఅర్జున్.కట్ చేస్తే.. ఈ సంవత్సరం `పుష్ప` సెకండ్ పార్ట్ `పుష్ప - ద రూల్` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారని తెలుస్తుంది . ఫిబ్రవరిలో పట్టాలెక్కనున్న ఈ రెండో భాగం.. సంవత్సరాంతంలో విడుదల కానున్నట్లు సమాచారం.

ప్రస్తుతం సుకుమార్ అండ్ టీమ్ సెకండ్ పార్ట్ కి సంబంధించిన ప్రి-ప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీగా ఉందని తెలుస్తుంది.ఇదిలా ఉంటే.. `పుష్ప - ద రైజ్` కోసం చెన్నై పొన్ను సమంత ఆడిపాడిన ``ఊ అంటావా మామా..ఊహూ అంటావా మామా`` గీతం ఏవిధంగా దుమ్ము రేపిందో అందరికి తెలిసిందే. అయితే ఈ పాట చిత్రానికి ఏ విధంగా ప్లస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. `పుష్ప - ద రైజ్` హైలైట్స్ లో ఒకటిగా ఈ ఐటమ్ పాట నిలిచింది. ఈ నేపథ్యంలోనే.. `పుష్ప - ద రూల్`లోనూ ఓ స్పెషల్ డ్యాన్స్ నంబర్ ని కథానుసారం జోడించనున్నారట టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్...

`పుష్ప - ద రైజ్`కి హిందీనాట దక్కిన అపూర్వ ఆదరణని దృష్టిలో పెట్టుకుని ఈ సారి దక్షిణాది నాయికతో కాకుండా ఓ బాలీవుడ్ భామతో ఈ ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్.. ప్రస్తుతం చిత్ర సంగీత దర్శకుడు అయిన దేవి శ్రీ ప్రసాద్ ఓ క్యాచీ ట్యూన్ ని రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.మరి.. ``ఊ అంటావా మామా``కి మించి ఈ ఐటమ్ నంబర్ ఉంటుందో లేదో మరి చూడాలి.పుష్ప సినిమాను అందరికి రీచ్ అయ్యేలా చేసింది ఈ ఐటమ్ పాట. సినిమాలో నటించిన హీరోయిన్ కంటే ఎక్కువగా ఈ పాటలో నటించిన సమంతకే ఎక్కువ పేరు వచ్చిందంటే అర్ధం చేసుకోవచ్చు. ఆ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో. మరి చూడాలి రెండో పార్టులో ఏ విధంగా ఆ పాట దుమ్ము రేపుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: