అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్, అభిజిత్ హీరోగా తెరకెక్కిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. అయితే ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన కంచె సినిమాతో ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇలా కంచె సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్యా జైస్వాల్ ఆ తర్వాత టాలీవుడ్ లో పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలు దక్కించుకుంది.  అందులో భాగంగా ఈ హాట్ బ్యూటీ నక్షత్రం, జయ జానకి నాయక వంటి సినిమాలలో నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని ప్రస్తుతం కూడా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. 

ఇలా సినిమాలతో ఫుల్ ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ  సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది. తన సినిమా షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉండే ప్రగ్యా జైస్వాల్ అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలను కూడా తన అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజుల క్రితమే అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు  నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. అయితే అలా హాట్ ఫోటోలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక క్లాస్ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలో ప్రగ్యా జైస్వాల్ చాలా క్లాస్ గా,  సింపుల్ గా ఫోటో కు స్టిల్ ఇచ్చింది. ఈ ఫోటో కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: