గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న సినిమా హీరో. గల్లా పద్మావతి నిర్మిస్తున్న ఈ సినిమాలో అసోక్ పక్కన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో చేసింది మూడు సినిమాలు.. పడింది ఒక్క హిట్టే అయినా ఇస్మార్ట్ బ్యూటీకి సూపర్ క్రేజ్ ఏర్పడింది. సినిమాలతో పాటుగా తనదైన ఒంపుసొంపులతో హాట్ ఫోటో షూట్స్ ఇస్తూ ఆడియెన్స్ కి షాక్ ఇస్తుంది అమ్మడు. ఇక హీరోగా అశోక్ మొదటి సినిమా కాగా 3 సినిమాల అనుభవం ఉన్న నిధి అగర్వాల్ పాపులారిటీ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. అయితే హీరో ఓ రొమాంటిక్, యాక్షన్, కామెడీ, యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతుంది.

అన్ని వర్గాల ఆడియెన్స్ ను మెప్పించేలా శ్రీరాం ఆదిత్య ఈ సినిమా తెరకెక్కించాడని అనిపిస్తుంది. అయితే ఈ సినిమాలొ నిధి అగర్వాల్ గల్లా అశోక్ కి లిప్ లాక్ ఇచ్చింది. సినిమా ట్రైలర్ లో అశోక్, నిధిల లిప్ లాక్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. డెబ్యూ హీరోకి నిధి అగర్వాల్ లిప్ లాక్ ఇవ్వడం ఫ్యాన్స్ ని ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. అఫ్కోర్స్ సినిమా డిమాండ్ చేస్తే అలాంటివి కామన్ అందులో హీరో కొత్త వాడా, స్టార్ హీరోనా అని చూడాల్సిన అవసరం లేదు. అంతేకాదు సినిమా ఒప్పుకున్నప్పుడే లిప్ లాక్ గురించి డిస్కషన్స్ వచ్చి ఉంటాయి.

అది తనకు నచ్చే సినిమా ఓకే చేసి ఉండొచ్చు. అయితే గల్లా అశోక్ తొలి సినిమా హీరో సినిమాలో నిధి లిప్ లాక్ చేసింది అంటే తప్పకుండా అమ్మడు సినిమాకు భారీగానే డిమాండ్ చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సినిమాలో నిధి అగర్వాల్ అందాలే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేలా చేస్తున్నారట. తప్పకుండా నిధి తన గ్లామర్ తో సినిమాకు అదనపు క్రేజ్ తెస్తుందని నమ్ముతున్నారు. సంక్రాంతి బరిలో దిగుతున్న హీరో సినిమాకు అశోక్ ని చూడటానికన్నా నిధి అగర్వాల్ కోసమే ఫ్యాన్స్ వస్తారని చెప్పొచ్చు. ఇక ఎలాగు ఘట్టమనేని ఫ్యామిలీ హీరో కాబట్టి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ ఉంటుంది. ఫైనల్ గా హీరోకి అంతటా మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.





మరింత సమాచారం తెలుసుకోండి: