బిగ్ బాస్ సీజన్ 4లో హంగామా చేసిన అఖిల్ సార్ధక్.. మోనాల్ గజ్జర్ లు ఆడియెన్స్ ఎప్పటికీ మర్చిపోరు. సీజన్ సీజన్ కి ఒక జంట హౌజ్ లో చాలా స్ట్రాంగ్ రిలేషన్ ని బిల్డ్ చేసుకుంటుంది. బిగ్ బాస్ లో అది చాలా కామన్ అయ్యింది. ఇక ఇదిలాఉంటే బిగ్ బాస్ తర్వాత వీళ్ల జంటతో వెబ్ సీరీస్ అంటూ హడావిడి జరిగింది. మోనాల్ గజ్జర్ కు వెంట వెంటనే ఒకటి రెండు ఛాన్సులు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ కథ మొదటికే వచ్చింది.

ఇదిలాఉంటే అఖిల్, మోనాల్ లను మళ్లీ బిగ్ బాస్ హౌజ్ లోకి పంపించాలని అనుకుంటున్నారట. ఆల్రెడీ బిగ్ బాస్ కి వెళ్లొచ్చిన వాళ్లిద్దరిని మళ్లీ ఎలా బిగ్ బాస్ కి పంపుతారు అంటే.. బిగ్ బాస్ ఓటీటీ తెలుగు లో అఖిల్, మోనాల్ లు వెళ్తున్నారని తెలుస్తుంది. వాళ్ల క్రేజ్ తో తెలుగు ఓటీటీ బిగ్ బాస్ కి మంచి హైప్ తీసుకు రావాలని చూస్తున్నారు. ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవబోతున్న బిగ్ బాస్ తెలుగు ఓటీటీలో అఖిల్, మోనాల్ గజ్జర్ లు కంటెస్టంట్స్ గా వస్తారని టాక్.

అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 1 నుండి నాలుగు సీజన్ల వరకు యాక్టివ్ గా ఉన్న వారిని ఒకరిద్దరిని బిగ్ బాస్ తెలుగు ఓటీటీకి పంపిస్తున్నారట. వీరికి బిగ్ బాస్ అసలు సీజన్ లానే భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారని టాక్. మరి బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఎలా ఉంటుంది. ఎవరెవరు ఈ సీజన్ లో కంటెస్టంట్స్ గా వస్తారు అన్నది త్వరలో తెలుస్తుంది.  వస్తున్న వార్తల ప్రకారం అఖిల్, మోనాల్ మళ్లీ హౌజ్ లోకి వెళ్తే వీరి లవ్ స్టోరీ అక్కడ మళ్లీ రిపీట్ అవుతుందని చెప్పొచ్చు. తెలుగు ఓటీటీ కోసం టీవీ యాంకర్లని.. పాపులర్ యూట్యూబర్స్ ని తీసుకున్నారని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: