మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు వరుస సినిమా లలో నటిస్తూ బిజిగా ఉన్నాడు. ప్రస్థుతం రాజమౌళి సినిమా ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తూన్నారు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఒక వైపు ఈ సినిమా చేస్తూనే మరో వైపు రెండు ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు.ఇప్పుడు రామ్‌ చరణ్‌ తన సినిమాల విషయంలో మరింత దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఒక పక్కన దర్శకుడు శంకర్ సినిమా చేస్తూనే తన తదుపరి చిత్రాన్ని 'జెర్సీ'తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో చేయనున్నాడు చెర్రి అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇతని సినిమా నిజమైతే చెర్రి ఖాతాలో మరో ఫ్రీ హిట్ పడినట్లే..


యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే పూజా కార్యక్రమాల తో ఈ సినిమా మొదలు కానుంది. ఈ సినిమా తో పాటుగా మరో రెండు సినిమాలు కూడా చరణ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాయని తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ఏంటంటే ఆ రెండు చిత్రాల అనంతరం 'శ్యామ్ సింగరాయ్'తో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంక్రిట్యన్ దర్శకత్వం లో రామ్ చరణ్ నటించనున్నట్టు సమాచారం. రీసెంట్‌గా 'శ్యామ్ సింగరాయ్' చూసి రామ్ చరణ్ మెచ్చుకున్న సంగతి తెలిసిందే.


ఇక ఈ నేపథ్యం లోనే మంచి కథ ఉంటే రాహుల్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తానని చెప్పినట్టు సమాచారం. అయితే వీళ్ల కాంబినేషన్‌ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.. అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఆచార్య సినిమా లో నటిస్తూన్నారు. మెగాస్టార్ చిరంజీవిసినిమా లో ప్రధాన పాత్రలో  నటిస్తూన్నారు. అన్నీ కార్యక్రమాల ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు విడుదల కు సిద్ధంగా వుంది. ఆ సినిమా చరణ్ కు ఎంత పేరును తీసుకొస్తుందొ చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: