ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమా లపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.. అందుకే అస్సలు తీరిక లేకుండా వరుస సినిమాలలో నటిస్తూన్నారు. దీంతో అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా ప్రభాస్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.అశ్వనీదత్ ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమా కోసం ఏకంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం.


అయితే ఈ సినిమా మేకర్స్ ను, ప్రభాస్ ను నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న బ్రహ్మాస్త్ర మూవీ టెన్షన్ పెడుతోందని అర్థమవుతుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్థయిన సంగతి తెలిసిందే..ప్రాజెక్ట్ కే సినిమా విషయానికి వస్తే ఈ సినిమా షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తైంది. ప్రాజెక్ట్ కే సినిమాను 2023 సంవత్సరంలో మే నెలలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. బ్రహ్మాస్త్ర కథకు, ప్రాజెక్ట్ కే కథకు పోలికలు ఉండటంతో ప్రాజెక్ట్ కే మేకర్స్ కు కంగారు మొదలైందని తెలుస్తోంది. ఒక ఆయుధం కొరకు జరిగే పోరాటానికి సంబంధించిన కథలతో ఈ రెండు సినిమాలు రూపొందుతున్నాయి.


నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే సినిమాకు బ్రహ్మాస్త్ర సినిమాకు పోలికలు రాకుండా స్క్రిప్ట్ లో స్వల్పంగా మార్పులు చేస్తున్నారని సమాచారం. ఈ విషయం పై పూర్తీ క్లారిటీ రావాల్సి ఉంది.నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మహానటి తర్వాత తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ మూవీ స్థాయి బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. ఈ సినిమా మూడు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..బాలివుడ్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది..తెలుగులో స్టార్ డైరెక్టర్ జక్కన్న ఈ మూవీని రిలీజ్ చేస్తుండటం గమనార్హం. నాగ్ నటిస్తుండటంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తెలుగులో బ్రహ్మాస్త్ర టైటిల్ తో సినిమా రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: