దిల్ రాజు బ్యానర్ సినిమాలంటే క్లీన్ ఎంటర్టైనర్స్.. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఉంటాయి. కానీ దిల్ రాజు కెరియర్ లో ఫస్ట్ టైం ఓ యూత్ ఓరియెంటెడ్ మూవీ అది కూడా బోల్డ్ సీన్లతో సినిమా తీశాడు. తన ఫ్యామిలీ హీరో ఆశిష్ కోసం దిల్ రాజు తన కెరియర్ లో ఈ కొత్త స్టెప్ తీసుకున్నాడు. ఆశిష్ హీరోగా హర్ష డైరక్షన్ లో వస్తున్న రౌడీ బోయ్స్ సినిమా ట్రైలర్ మంచి ఇంప్యాక్ట్ క్రియేట్ చేసింది. అంతేకాదు సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆమెతో ఓ లిప్ లాక్ కూడా ఇప్పించారు.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ లో ఉంది జస్ట్ శాఇంపిల్ మాత్రమే అసలు సినిమా వెండితెర మీద చూడాల్సిందే అంటున్నారు. ఈ సినిమాలో అనుపమ ఓ రేంజ్ లో రెచ్చిపోయిందని తెలుస్తుంది. సెన్సార్ వాళ్లు కూడా రౌడీ బోయ్స్ సినిమా చూసి ఇది దిల్ రాజు బ్యానర్ సినిమానేనా అని అడిగారంటే సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. బోల్డ్ సీన్లు.. బీప్ డైలాగ్స్ ఇలా రౌడీ బోయ్స్ అంతా యూత్ ఆడియెన్స్ టార్గెట్ తోనే వస్తుందని తెలుస్తుంది. సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కొత్తగా రొమాంటిక్ యాంగిల్ లో కనిపిస్తుంది.

ఇంతకుముందు వరకు తనకు ఉన్న ఇమేజ్ మార్చేలా అనుపమ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎంత నిర్మాత ఫ్యామిలీ హీరో అయితే మాత్రం ఈ రేంజ్ లో రెచ్చిపోవాలా అని ఫ్యాన్స్ ఆమెని టార్గెట్ చేస్తున్నారు. హీరోయిన్ అన్నాక అన్ని పాత్రలు చేయాలి.. అన్నివిధాలుగా కనిపించాలి. ఈ క్రమంలో అనుపమ పరమేశ్వరన్ రౌడీ బోయ్స్ కోసం భారీ రేంజ్ లో రెచ్చిపోయిందని అర్ధమవుతుంది. ట్రైలర్ లో లిప్ లాక్ కే యూత్ పిచ్చివాళ్లు అయ్యారు. ఇక సినిమాలో అంతకుమించి అంటే రౌడీ బోయ్స్ రచ్చ చేయడం షురూ అని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: