అలియా భట్ చాల మూడీగా ఉంటుందని ఆమెతో సినిమాలు తీసే దర్శక నిర్మాతలు బాలీవుడ్ లో అభిప్రాయపడుతూ ఉంటారు. అంతేకాదు ఆమె ఒకొక్కసారి తాను నటించిన సినిమాలను కూడ సరిగ్గా ప్రమోట్ చేయదు అన్నఅభిప్రాయాలు కూడ ఉన్నాయి. అయితే ఇవేమీ పట్టించుకోకుండా రాజమౌళి తన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో ‘సీత’ పాత్రను పోషించగల సత్తా ఒక్క అలియా భట్ కు మాత్రమే ఉంది అన్నఅభిప్రాయంలో జక్కన్న అలియా భట్ విషయంలో చాల రాజీ పడ్డాడు అన్నకామెంట్స్ కూడ ఉన్నాయి.


ఇలాంటి కామెంట్స్ అలియా భట్ పై రావడానికి ఒక ఆసక్తికర కారణం ఉంది అని అంటున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని ఉత్తర భారతదేశంలో అదేవిధంగా దక్షిణాది ప్రాంతానికి చెందిన అనేక నగరాలలో రాజమౌళి తన టీమ్ తో కలిసి ఒక స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ లో రాజమౌళి దేశంలోని అన్ని ప్రముఖ నగరాలను ఒక చుట్టుచుట్టేశాడు. ఈప్రమోషన్ కు సుమారు 20 కోట్లు ఖర్చు అయింది అని అంటారు.


ఇప్పుడు ఈమూవీకి సంబంధించి బాలీవుడ్ లో ఒకప్రముఖ ఛానల్ నిర్వహించే కపిల్ శర్మ టాక్ షోలో రాజమౌళి తన సినిమా టోటల్ టీమ్ తో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈటాక్ షోలో పాల్గొన్న రాజమౌళి చరణ్ జూనియర్ లు తమ షర్ట్ పై ‘ఆర్ ఆర్ ఆర్’ అంటూ ఒక స్పెషల్ డిజైన్ షర్ట్ ను వేసుకుంటే అదే షోకు అతిధిగా వచ్చిన అలియా భట్ మాత్రం తన శారీ పై ‘ఆర్ ఆర్ ఆర్’ లోగో ను వేసుకోనని అలియా భట్ తెగేసి చెప్పినట్లు టాక్.


అంతేకాదు ఈమూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో లైట్ బాయ్ మొదలు హీరో వరకు అందరూ ఐడీ కార్డులు వేసుకొని పనిచేస్తే ఆ ఐడీ కార్డును తీసుకున్న అలియా భట్ తన కార్డును మేడలో వేసుకోకుండా తన హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుని జక్కన్నకు షాక్ ఇచ్చింది అన్న గాసిప్పులు వచ్చాయి. ఏది ఏమైనా తనకు అలియా భట్ మాత్రమే కావాలి అని రాజమౌళి పట్టుపట్టి తెచ్చుకున్న పరిస్థితులలో జక్కన్న అలియా భట్ విషయంలో కొంత రాజీపడ్డాడు అంటూ మరికొందరు ఈగాసిప్పులను ప్రచారంలోకి తీసుకువస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: