దేశం యావత్తు కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం కావడంతో సంక్రాంతికి దక్షిణాది రాష్ట్రాలలో విడుదలకావలసిన సినిమాలు అన్నీ వరసపెట్టి వాయిదా పడుతున్నాయి. చివరకు ఫిబ్రవరిలో విడుదల కావలసి ఉన్న అనేక భారీసినిమాలు కూడ వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


దీనితో ఈసినిమాలు అన్నీ ఏప్రియల్ మే నెలలో విడుదలకావలసి ఉంది. దీనితో భారీ సినిమాలు అన్నీ సమ్మర్ రేస్ పైనే దృష్టి పెట్టాయి. ఈపరిస్థితులలో కన్నడ టాప్ హీరో యష్ తన ‘కేజీ ఎఫ్ 2’ మూవీకి సంబంధించి మళ్ళీ వాయిదా వేసుకోమని ఎవరు ఒత్తిడి చేయకుండా తన పుట్టినరోజు సందర్భంగా ‘కేజీ ఎఫ్ 2’ ఏప్రియల్ 14న విడుదల అయి తీరుతుందని అందరికీ క్లారిటీ ఇస్తూ భారీ ప్రకటనలు ఇచ్చాడు.


ఇప్పటికే వాయిదాపడిన ‘ఆర్ ఆర్ ఆర్’ ‘రాధే శ్యామ్’ లు ఏప్రియల్ విడుదలకోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే ఈమూవీల ఆలోచనలకు యష్ ఏమాత్రం సహకరించేలా కనిపించడం లేదు. ఫిబ్రవరిలో విడుదలకావలసి ఉన్న ‘ఆచార్య’ ‘భీమ్లా నాయక్’ లు కూడ వాయిదా పడి సమ్మర్ రేస్ వైపు వెళతాయి అంటున్నారు. ఇప్పుడు అదే సమయానికి భారీ అంచనాలు ఉన్న పాన్ ఇండియా మూవీ ‘కేజీ ఎఫ్ 2’ విడుదల అయితే ఈభారీ సినిమాలు అన్నింటికీ ఏప్రియల్ లో డేట్ దొరకడం కష్టం. ఇది చాలదు అన్నట్లుగా ఏప్రియల్ లో ‘ఎఫ్ 3’ కూడ రిలీజ్ కు రెడీ అవుతోంది.


దీనితో ఇన్ని భారీ సినిమాలకు ఒకే నెలలో స్పేస్ ఎక్కడది అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ‘మా సినిమాను ప్రేక్షకులకు అందించడానికి చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. ఎందుకంటే ‘కేజీ ఎఫ్ 2’ తో ఏం క్రియేట్ చేశామో మాకు తెలుసు. ఖచ్చితంగా ఇది ప్రేక్షకులకు నచ్చుతుంది. మేం పసందైన భోజనం సిద్ధం చేశాం. ప్రేక్షకులు కూడా ఆకలితో ఉన్నారని తెలుసు. కాబట్టి ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయం’ అంటూ ‘కేజీ ఎఫ్ 2’ నిర్మాతలు ఇచ్చిన ప్రకటన ఒకవిధంగా మన టాప్ హీరోలందరికీ కలవరపాటు కలిగించే విషయం..



మరింత సమాచారం తెలుసుకోండి: