స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు.. కొన్ని సంవత్సరాల క్రితం జనసేన పార్టీని స్థాపించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా 2019 వ సంవత్సరం లో ఎన్నికల ఈ పార్టీ తరఫున వందకు పైగా అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ అనుకున్న స్థాయిలో ఫలితాలు మాత్రం రాలేదు.. కేవలం రెండు స్థానాలలో పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పటికీ రెండు గెలవలేకపోయారు. అయితే కేవలం తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే జనసేన పార్టీ ఒక సీటు గెలిచింది. కానీ రాబోయే 2014 ఎన్నికలలో మాత్రం జనసేన పార్టీ కాస్త ఎక్కువ సీట్లు గెలిచిలా కనిపిస్తోంది.

ఇక ఈసారి కూడా టిడిపి జనసేన ఇద్దరు కలిసి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే తాజాగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది రాజకీయ ఎంట్రీపై..ఒక ఇంటర్వ్యూలో  తెలియజేయడం జరిగింది. ఆది మాట్లాడుతూ తన జనసేన పార్టీలోనే చేరతానని చెప్పుకొచ్చారు. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానం తోనే ఇలా చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక అంతే కాకుండా 2019 వ సంవత్సరంలో ఆ పార్టీ తరపున కొన్ని ప్రచారాలు కూడా చేశానని తెలియజేశాడు. అంతేకాకుండా పవన్ కు ఎల్లప్పుడు తన సపోర్ట్ చేస్తాను అని తెలియజేశాడు. పవన్ కళ్యాణ్ ఎటువంటి పని చేసిన అది కరెక్ట్ గానే ఉంటుందని హైపర్ ఆది కామెంట్ చేశారు.పవన్ కళ్యాణ్ కు ఎన్ని సంవత్సరాల పాటు అయిన సపోర్ట్ ఉంటుందని తెలియజేశాడు.

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావడం కాస్త ఆలస్యం కావచ్చని తెలియజేశారు. ప్రస్తుతం ఈ వార్తలు విన్న జనసైనికులు కాస్త ఉత్సాహం వచ్చేలా ఉంది అన్నట్టు గా సమాచారం. ప్రస్తుతం జబర్దస్త్ లోనే కాకుండా మరి కొన్ని షో లో కూడా నటిస్తున్నాడు హైపర్ ఆది. ప్రస్తుతం అక్కడక్కడ సినిమాలలో కూడా కనిపిస్తూ తన హవాను కొనసాగిస్తున్నాడు. ఇక ఈయన స్కిట్లు కూడా యూట్యూబ్ లో కూడ మంచి స్పందన లభిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: