ఇటీవల అఖండ సినిమాతో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ అందుకున్న ఊర మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను. ఇక ఆ తర్వాత ఎలాంటి సినిమాతో వస్తాడు అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.ఇక ఈ మధ్య అల్లు అర్జున్ తో కూడా చర్చలు జరిపినట్లు అనేక రకాల కథనాలు వచ్చాయి. నిజానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అయితే మరొక సినిమా చేయాల్సిన కమిట్మెంట్ అయితే ఉంది. అంతే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా బోయపాటిసినిమా చేసే అవకాశం ఉన్నట్లు గా అనేక రకాల రూమర్స్ కూడా హల్చల్ చేసాయి.కానీ దర్శకుడు బోయపాటి శ్రీను మాత్రం తన తరువాత సినిమాపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం అక్కినేని కాంపౌండ్ పై కూడా ఈ దర్శకుడు ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కినేని హీరో అఖిల్ 6వ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అయితే కొనసాగుతోంది.

గతంలో ఎప్పుడూ లేని విధంగా అక్కినేని అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా spy యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇక ఆ సినిమా తోనే అక్కినేని అఖిల్ తన బాక్సాఫీస్ వద్ద తన స్థానాన్ని పెంచుకుంటాడు అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను కూడా అఖిల్ పైనే ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా ఇప్పట్లో మొదలు పెట్టడం కుదరని పని. ఎందుకంటే పుష్ప తరువాత బన్నీ ఐకాన్ సినిమా తో పాటు కొరటాల శివ తో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇక ఆ లైనప్ తో ఎంతవరకు ముందుకు సాగుతాడో తెలియదుగానీ బోయపాటి శ్రీను మాత్రం తప్పకుండా చేస్తాడని సమాచారం తెలుస్తోంది.అందుకే ఇక బన్నీ డేట్స్ దొరకడం కష్టమని కూడా ఆ లోపు అక్కినేని అఖిల్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమవుతుందో అనేది ఇప్పుడు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: