మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ లు నక్సలైట్ లుగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.

 ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను  ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం అఫీషియల్ గా ప్రకటించింది. అయితే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ నటించడం వల్ల ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ విడుదల అయిన తర్వతే విడుదల చేయాలని ఒప్పందం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ జనవరి 7 వ తేదీన విడుదల అనుకున్నారు. కాబట్టి ఫిబ్రవరికి ఆచార్య సినిమా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే అనూహ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడడంతో ఇప్పుడు ఆచార్య కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో ఆచార్య సినిమా విడుదల తేదీని రాజశేఖర్ తన శేఖర్ సినిమా విడుదల కోసం లాక్ చేసినట్లు తెలుస్తోంది. శేఖర్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కాకపోతే ప్రస్తుతం మాత్రం ఈ సినిమాను ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా రాజశేఖర్, మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదల తేదీపై ఫోకస్ పెట్టాడు

మరింత సమాచారం తెలుసుకోండి: