అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాతో టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఇలా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇలా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్  శాంతన్ హాజరికని అభిమానులకు పరిచయం చేసింది. తాజాగా వీరిద్దరు కలిసి సోషల్ మీడియా క్విజ్ లో పాల్గొన్నారు. ఈ సోషల్ మీడియా క్విజ్ లో ఇద్దరు పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

 అందులో భాగంగా శృతి హాసన్ నే మొదట శాంతనుకి ఐ లవ్ యు అని చెప్పినట్లు తెలిపింది. ఇది మాత్రమే కాకుండా ఇద్దరిలో ఎవరు బాగా ప్రొటెక్టివ్ గా ఉంటారని అడగగా వారు ఇరువురు ఒకరినొకరు చూపించుకున్నారు. ఇది ఇలా ఉంటే వీరిద్దరు గత రెండు సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్నట్లు శృతి హాసన్ గతేడాది సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఇది ఇలా ఉంటే శృతిహాసన్ సినిమాల విషయానికి వస్తే..  ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది. దీనితో పాటు నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కూడా శృతిహాసన్ హీరోయిన్ గా నటించబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: