మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌తో ఉన్నారు. ఇటీవల ప్రముఖ దర్శకుడు రాజమౌళితో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీ అయ్యారు. ఈ సినిమా పూర్తి చేసుకుంది. థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. ఆర్ఆర్ఆర్ మూవీ కంప్లీట్ అవడంతో రామ్‌చరణ్ మరో మూవీకి ఒప్పుకున్నారు. వరుస సినిమాలు చేయడానికి ఇప్పటికే పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వాయిదా పడటంతో అభిమానుల్లో నిరాశ మిగిలింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, అజయ దేవగన్ నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్స్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. వీటికి మంచి రెస్పాన్స్ కూడా దక్కింది.


సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా జరిగాయి. ఈ నెల 7వ తేదీన రిలీజ్ కావాల్సిన సినిమా ఊహించని రీతిలో వాయిదా పడింది. దీంతో ప్రేక్షకులు ఎంతగానో నిరాశ చెందారు. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్, కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాను రిలీజ్ చేసినా.. నష్టపోతామని దర్శకనిర్మాతలు భావించారు. దీంతో సినిమాను వాయిదా చేయడమే బెటర్ అని భావించారు.

ఆర్ఆర్ఆర్ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత.. ఇటు రామ్ చరణ్, అటు ఎన్టీఆర్ వేరే చెప్పలేదు. సినిమా పూర్తి కావడంతో వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు శంకర్‌తో కలిసి రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అలాగే జెర్సీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో కలిసి మరో సినిమా చేయనున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కించనున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెలువడనున్నాయి.

తాజాగా యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మరో సినిమా నటించనున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన శ్యామ్ సింగరాయ్ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు రాహుల్. ఈ సినిమాను రామ్ చరణ్ చూసి.. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. మంచి స్టోరీ ఉంటే తనతో సినిమా చేయడానికి సిద్ధమని రామ్ చరణ్ చెప్పినట్లు సమాచారం. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ రాబోతుందో లేదో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: