తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే నేషనల్ క్రష్ గా గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన ఇప్పుడు సూపర్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక మందన. ఒకప్పుడు గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ఇటీవల కాలంలో తన గ్లామర్ ఒలకబోస్తూ ప్రేక్షకుల మతి పోగొడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ సూపర్ డూపర్ విజయాలని తన ఖాతాలో వేసుకుంది ఈ సొగసరి. ఇక ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంది రష్మిక మందన.



 ఇలా ప్రస్తుతం సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్న రష్మిక మందన ఇప్పుడు ఒక ఫ్లాప్ దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధమవుతోంది అని అర్థమవుతుంది. చిత్ర పరిశ్రమలో రైటర్గా నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు రాహుల్ రవీంద్రన్. అయితే నాగార్జున తో తీసిన మన్మధుడు 2 సినిమా తర్వాత ఇప్పటివరకు దర్శకుడిగా అవకాశాన్ని దక్కించుకోలేకపోయాడు. మన్మధుడు 2 సినిమా అట్టర్ ప్లాప్ అయింది అన్న విషయం తెలిసిందే. ఇక మన్మధుడు 2 సినిమా తర్వాత ఇప్పటివరకు దర్శకుడిగా ఒక్క సినిమా కూడా చేయనీ రాహుల్  రవీంద్రన్ తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న సినిమా చేసేందుకు రెడీ అయింది అని తెలుస్తోంది..



 దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణల కారణంగా బతుకు బండి ముందుకు నడిచేందుకు కిరాణాకొట్టు పెట్టుకున్న ఒక యువతి ఆ తర్వాత కాలంలో బిజినెస్ ఉమెన్ గా  ఎలా ఎదిగింది అనే కాన్సెప్టుతో ఇక రాహుల్ రవీంద్రన్ సినిమా తెరకెక్కిస్తూ ఉండగా... ఇక ఈ సినిమాలో ప్రధానపాత్రలో రస్మిక నటించబోతుందట. అయితే ప్రస్తుతం సూపర్ సక్సెస్ లో ఉన్న రష్మిక ఇలాంటి ప్రాజెక్టు ను ఎలా ఓకే చేసింది అని ప్రస్తుతం అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా హిట్ అవ్వకపోతే  రష్మిక కెరియర్ కు దెబ్బ పడుతుంది అని మరి కొంతమంది అంటున్నారు. ఇకపోతే దర్శకుడు రాహుల్ రవీంద్రన్  హీరోయిన్ సమంత కు మంచి స్నేహితుడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: