ప్రతి డైరెక్టర్ ఇంకా హీరో తమ సినిమాలు సక్సెస్ సాధించాలనే ఆలోచనతోనే సినిమాలను మొదలుపెడతారు. అయితే కొన్ని కారణాల వల్ల కొన్ని సినిమాలు విడుదలైన తర్వాత ఫ్లాప్ ఫలితాన్ని అందుకుంటాయి.ఇక ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు పేర్లతో క్రిష్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కి కొన్ని రోజుల గ్యాప్ లోనే థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ కావడంతో పాటు ఇంకా చాలా భారీ నష్టాలను మిగిల్చాయి.ఇక టాలీవుడ్ ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు మాటల రచయితగా పని చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిమాధవ్ బుర్రా ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాప్ అయిందనే బాధ వర్ణనాతీతం అని అది జీవితాంతం ఉంటుందని చెప్పుకొచ్చారు. స్కూల్ లో చదువుకునే సమయంలోనే తాను నాటకాలు బాగా వేశానని తన తల్లిదండ్రులు స్టేజ్ ఆర్టిస్టులు అని తెనాలిలో తాను పుట్టి పెరిగానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక సినిమాలకు రచయితగా పని చేయాలనే ఆలోచనతో వచ్చిన తాను కెరీర్ లో ఎన్నో ఒడిదొడుకులను కూడా ఎదుర్కొన్నానని ఆయన అన్నారు.

అలాగే ఆకలితో అలమటించిన రోజులు కూడా తన లైఫ్ లో ఉన్నాయని సాయిమాధవ్ బుర్రా కామెంట్లు చేశారు. ఇక కొన్ని సీరియళ్లకు తాను పని చేశానని సీరియళ్ల వల్లే తనకు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కృష్ణం వందే జగద్గురుం సినిమాకు పని చేసే అవకాశం లభించిందని సాయిమాధవ్ బుర్రా అన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ కు పని చేసే అవకాశం రావడంతో ఆ ఛాన్స్ రావడం అదృష్టం అని ఫీలయ్యానని ఆయన తెలిపారు. ఇక ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని చాలా బాధ ఉందని సాయిమాధవ్ అన్నారు.సీనియర్ ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఖైదీ నంబర్ 150 మూవీకి పని చేసే ఛాన్స్ దక్కడంతో తాను చాలా సంతోషంగా ఫీలవుతున్నానని సాయిమాధవ్ బుర్రా వెల్లడించారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకు పని చేసే అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని సాయిమాధవ్ బుర్రా చెప్పుకొచ్చారు. కొన్ని డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని భావిస్తే ఆ డైలాగ్స్ ఆకట్టుకోని సందర్భాలు కూడా ఉన్నాయని సాయిమాధవ్ బుర్రా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: