తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇక అప్పటికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే అనుకున్న సమయానికి ఆచార్య ప్రేక్షకులను సందడి చేయనునట్లు సమాచారం.

అయితే తాజాగా ఈ సినిమాలో సిద్దు పాత్రలో నటించిన చరణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. దర్శకుడు .కొరటాల శివ ఎంతో అద్భుతమైన కథను తీసుకువచ్చారని ముఖ్యంగా ఇందులో చిరంజీవి,తను ఇద్దరు నక్సలైట్ పాత్రలో నటిస్తున్నారని చరణ్ వారి పాత్రల గురించి వెల్లడించారు. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో తాను నటించాలని ఎప్పుడూ అనుకోలేదని అనుకోని విధంగా ఈ సినిమాలో నటించాల్సి వచ్చిందని అన్నారు.

ఈ సినిమాలో  సిద్దు పాత్రలో నటించడం కోసం నాకన్నా ఇద్దరు ముగ్గురు హీరోలను సంప్రదించినట్లు తెలిపాడు. చివరికి అవి వర్కవుట్ కాకపోవడంతో ఒకరోజు కొరటాల శివ ఫోన్ ఒకసారి కథ విన్న తర్వాత నిర్ణయం నువ్వే తీసుకో అంటూ తనకు చెప్పారని కథ వినగానే ఎంతో అద్భుతంగా అనిపించడంతో రాజమౌళి అనుమతి తీసుకోని సినిమాలో నటించానని చెప్పుకొచ్చారు.

ఇక ఈ చిత్రంలో  మెగాస్టార్ పాత్ర కూడా ఎంతో అద్భుతంగా ఉందని, ఇప్పటివరకు ఆయన ఇలాంటి పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదని అన్నారు. ఈ మూవీ మొత్తంలో  సిద్ద పాత్రలో నటించడం కోసం తనని తాను ఎంతో మార్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఎంతో అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడు విడుదలైన అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందని నమ్మకంగా ఉందని అన్నారు. ఈ చిత్రానికీ మణిశర్మ సంగీతం అందించిన పాటలకి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: