టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బంగార్రాజు. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిస్తుండగా మరో కీలక పాత్రలో అక్కినేని నాగ చైతన్య కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు.  ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత పెంచేశాయి. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది.  అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో బంగార్రాజు చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా మ్యూజికల్ ఈవెంట్ ను చిత్ర బృందం నిర్వహించింది.

 ఈ ఈవెంట్ లో అక్కినేని నాగ చైతన్య మాట్లాడుతూ.. మనం మూవీకి ఇలాంటి ఫంక్షన్ చేశాం. బంగార్రాజు సినిమాకి మళ్లీ ఇలాంటి ఫంక్షన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అని నాగ చైతన్య తెలియజేశాడు. ఆడియోను పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు నాగచైతన్య. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క సాంగ్ హిట్ అయితే ఓపెనింగ్స్ అదిరిపోతాయి. అలాంటిది ఈ మూవీ కోసం అనూప్ రూబెన్స్ అద్భుతమైన ఆల్బమ్ ను ఇచ్చారు అని నాగ చైతన్య తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే బంగార్రాజు సినిమా 2016 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి కలెక్షన్ ల వర్షం కురిపించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: