స్టార్ హీరోయిన్ అయిన సమంత అంటే చాలా మందికి అభిమానం గౌరవం ఉండేది. తనకు వచ్చే డబ్బులతో ప్రత్యూష ఫౌండేషన్ పేరిట ప్రాణాపాయంలో ఉన్న మహిళలు, చిన్నారులను కొంత మంది అనాధ పిల్లలుకు హెల్ప్ చేస్తూ..చిన్న వయస్సులోనే పెద్దరికం చాటుకుంది. అంతేకాదు సమంత తన దృష్టికి వచ్చిన చాలా మంది పేద ప్రజలకు..ఇబ్బందుల్లో ఉన్న సినీ పరిశ్రమలో ఉండేవాలకి చాలా సార్లు సహాయం చేసి ఆదుకున్నారట. కానీ తన హెల్ప్ చేసిన విషయం బయటకి చెప్పుకోవడానికి ఇష్టపడని  సమంత ఆ విషయాలు బయటకి రానివ్వలేదు. సహాయం చేస్తా కానీ పబ్లిసిటీ చేసుకొను అంటూ చెప్పుతుందట సమంత వాళ్ల ఫ్రెండ్స్ కి. నిజంగా ఇలాంటి ఓ హీరోయిన్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉండటం గర్వ కారణం అంటుంటారు ఆమె అభిమానులు.

ఇక అలాంటి మంచి పేరు సంపాదించుకున్న సమంత తన భర్త తో విడిపోవాలని నిర్ణయించుకుని తప్పు చేసిందంటున్నారు  కొందరు నెటిజన్స్. మరికొందరు అయితే ఇది వాళ్ల ప్రాబ్లం..వాళ్లే సాల్వ్ చేసుకుంటారు మధ్యలో మనం ఇన్వాల్వ్  అవ్వకూడదు అది వాళ్లిద్దరి పరసనల్  విషయం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక విడాకుల తరువాత ఫుల్ బిజీ బిజీ గా మారిపోయిన సమంత తనకు సమయం ఉన్నప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక్క పోస్ట్ పెట్టి వార్తలో హెడ్ లైన్స్ లో కనిపిస్తుంది.

ఇక రీసెంట్ గా సమంత తను ఎదుర్కున్న కొన్ని సమస్యల గురించి చెప్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత మాట్లాడుతూ.." నేను నా లైఫ్ లో చాలా కష్టాలను చూశాను. ఎన్నో ప్రాబ్లంస్ ని ఫేస్ చేసా.. మానసికంగా కూడా సమస్యలు ఎదుర్కొన్న. కానీ వాటి నుంచి నన్ను నేను కాపాడుకోగలిగాను.. బయటపడగలిగాను. ఈ విషయంలో నాకు కొందరు బాగా హెల్ప్ చేశారు. ఈ వైరల్ కాలంలో పర్‌ఫెక్ట్‌గా జీవించాలంటే జరిగే పని కాదు.  మన జీవితాల్లోని పడిన  బాధలు, ఎదుర్కున్న ఇబ్బందికర పరిస్థితులను గురించి నాలాంటి అమ్మాయి మాట్లాడితే ఖచ్చితంగా  ప్రజలు అంగీకరిస్తారనే అనుకుంటున్నాను"..అంటూ చెప్పుకొచ్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: