తన గ్లామర్ తో గ్లామర్ బ్యూటీ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది కృతి శెట్టి. ఇక తన మొదటి సినిమాతోనే ఏ స్థాయిలో బాక్సాఫీస్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆఫర్లు అయితే చాలా గట్టిగానే వస్తున్నాయి. దాంతోపాటు పారితోషకం స్థాయిని కూడా పెంచేసింది.  తాజాగా కృతి శెట్టి నానితో జతకట్టి శ్యామ్ సింగరాయ్ సినిమా చేసింది ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ బ్యూటీ రేంజ్ అమాంతం పెరిగి పోయింది. కృతి శెట్టి గ్లామరస్ రోల్స్ ఎ కాకుండా లిప్ లాక్ సన్నివేశాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తన సినిమాల ద్వారా  క్లారిటీ వచ్చేసింది. 

అది తాజాగా ఈ బ్యూటీ  అగ్ర హీరోయిన్స్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కృతి శెట్టి రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లేకపోతే తను నటిస్తున్న బంగార్రాజు సినిమా కి కూడా అదే స్థాయిలో ఇచ్చారని కథనాలు వెలువడ్డాయి.  అయితే ఎందుకు ఈ బ్యూటీ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అనే ప్రశ్న అందరికీ కలుగుతోంది.కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు దర్శకుడు తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనడం జరిగింది.భారీస్థాయిలో కృతి శెట్టి పారితోషికం ఇవ్వడానికి గల కారణాలు చెప్పాడు.

అయితే కళ్యాణ్ కృష్ణ ఉప్పెన సినిమా కంటే ముందే బంగార్రాజు సినిమా కథను కృతి శెట్టి కి వినిపించాడట.... అయితే అప్పటికి రెమ్యూనరేషన్ గురించి వాళ్ళు ఇంకా ఏమీ మాట్లాడుకోలేదట. అయితే ఎవరికైనా సరే మార్కెట్ ను బట్టి డిమాండ్ ఉండడం సహజం. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన బంగార్రాజు సినిమాలోని నాగలక్ష్మి అనే పాత్రకు కరెక్టుగా సరిపోతుంది అనిపించింది.  అయితే అందుకే కృతి శెట్టి రేంజ్ కు తగ్గట్టుగా పారితోషకం ఇవ్వాల్సి వచ్చింది.  ఇకపోతే ఓపెన్ ఆ సినిమా కంటే ముందే ఈ సినిమా చేసి ఉంటే తన పారితోషకం కొంచమైనా తగ్గదేమో అని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ వివరణ ఇచ్చాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: