ఎన్టీఆర్ చేసిన పొరపాటు ఆర్ ఆర్ ఆర్ సినిమా చేయడం అని గత కొన్ని రోజులుగా ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెగ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మల్టీస్టారర్ సినిమా కాకుండా ఎన్టీఆర్ సోలో గా ఆ లెవెల్ లో సినిమా చేసి ఉంటే ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ అయిపోయేవాాడు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయడం మంచిదే అయినా ఇన్ని సంవత్సరాల వ్యవధి అయన పాన్ ఇండియా ఎంట్రీ కోసమే అవటం పట్ల ఎన్టీఆర్ అభిమానులు ఆవేశంతో ఊగిపోతున్నారు. పోనీ ఇంతా చేసి క్రెడిట్ సోలోగా వస్తుందా అంటే రాదు. అల్లు అర్జున్ చేసిన పని ఎన్టిఆర్ చేసుంటే బాగుండేదని పుష్ప సినిమా తరువాత అందరూ చెప్పే మాట. 

అల్లు అర్జున్ ఎక్కువ సమయాన్ని వృధా చేయకుండా పుష్ప సినిమా ను త్వరత్వరగా కంప్లీట్ చేసి దేశ వ్యాప్తంగా విడుదల చేసి పాన్ ఇండియా హీరోగా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయాడు. ఆయనకు గతంలో ఉన్న క్రేజ్ తో పాటు ఇప్పుడు ఈ హిట్ సినిమా తీసిన కూడా తోడవడంతో ఆయన ఎంతో ఈజీగా తొందరగా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అయితే ఎన్టీఆర్ ఇంకా ఆ పాన్ ఇండియా గుర్తింపు రాకపోవడం అభిమానులకు తీవ్రమైన నిరాశ ను కలగజేస్తుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎక్కువ సమయం తీసుకోవడం తో పాటు హిట్ క్రెడిట్ రాజమౌళి రామ్ చరణ్ తీసుకోవడం వల్ల ఎన్టీఆర్ కి సోలో హిట్ పడాల్సిన చాలా అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. 

ఎన్టీఆర్ ఇప్పుడు చేయబోయే కొరటాల శివ సినిమాపై ఎక్కువగా ఆయన పాన్ ఇండియా భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సినిమా ఎలానో ఉంది. అయితే ఆ సినిమా ఉన్నాకూడా దానికి చాలా సమయం ఉండడంతో ఎన్టీఆర్ కు ఇప్పుడు ఇమీడియట్ గా కొరటాల శివ సినిమా ఎలాగైనా పాన్ ఇండియా ఇమేజ్ తీసుకురావాల్సిన బాధ్యత ఏర్పడింది. ఇటు కొరటాల శివ కూడా ఈ సినిమాలు చేయడంలో పెద్దగా ఆరితేరినవాడు కాకపోవడంతో ఎన్టీఆర్ నటించిన సినిమా పట్ల ఇప్పుడు టెన్షన్ నెలకొంది. మరి ఎన్టిఆర్ ఎందుకు ఇలా వెనకపదేలా చేసుకున్నాడో తెలీదు. దీన్ని ఎన్టిఆర్ ఫాన్స్ ఎంతో ప్రేస్టేజ్ గా తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: