నాగ చైతన్య పేరుకి అక్కినేని నాగార్జున కొడుకే అయినా తండ్రిలోని క్వాలిటీస్ ఏం రాలేదు. నాగార్జున ఎంత రొమాంటిక్ గా..అల్లరిగా ఫన్నీగా మాట్లాడుతూ తాను ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పూయిస్తూ పాజిటివ్ వైబ్స్ తీసుకోస్తాడు. కానీ ఆయన కొడుకు నాగచైతన్య మాత్రం, ఎప్పుడు కూల్ గా గొడవలు కు పోకుండా తన పని తాను చేసుకుంటూ సోషల్ మీడియాకి దూరంగా..కుటుంబానికి దగ్గరగా ఉంటాడు. తండ్రి ఈ వయసులోను మన్మధుడు లా దూసుకుపోతుంటే కొడుకు మాత్రం అమ్మ చాటు బిడ్డగా సైలెంట్ గా ఉంటాడు అని అంటున్నారు కొందరు నెటిజన్స్.

సినిమాల పరంగా నాగ చైతన్య ఎప్పుడు ది బెస్ట్ ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా తండ్రి నాగార్జున తో కలిసి చైతన్య బంగార్రాజు అనే సినిమాలో  నటిస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన బడా సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడంతో..సంక్రాంతి రేస్ లోకి వచ్చాడు ఈ బంగార్రాజు. 160 నిమిషాల నిడివితో  తెరకెక్కిన బంగార్రాజు  సినిమా కి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ బంగార్రాజు.. సంక్రాంతికి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసారు. ఇక టైం  తక్కువుగా ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ చక చకా జరిపేస్తున్నాడు నాగార్జున.

ఇటీవల 'బంగార్రాజు' ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్  ఓ గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్ జరిపారు. ఇక  ఈవెంట్‌లో నాగచైతన్య చాలా యాక్టివ్ గా కనిపించాడు. ఇక ఈ క్రమంలోనే  స్టేజ్‌పై జరిగిన ఓ సంఘటన నెట్టింట వైరల్‌గా మారింది. బంగార్రాజు చిత్రంలో  కీలక పాత్ర చేస్తున్న దక్షా నాగర్కర్ తో చై బీహేవియర్ హాట్ టాపిక్ గా మారింది.   ఈవెంట్‌లో నాగార్జున సినిమా గురించి మాట్లాడుతుండగా.. నాగచైతన్య, దక్షా ఒకరినొకరు చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు. అయితే దీని పై కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ.. చైతూ సమంతని మర్చిపోవడానికి వేరే అమ్మాయితో కనెక్ట్ అవుతున్నాడా..లేక వేరే ఎవ్వరైనా ఆయన హ్యాపీగా మళ్ళీ చిరునవ్వుతో కనిపించడానికి వేరే అమ్మాయిని కనెక్ట్ చేస్తున్నారా అంటూ డిస్కషన్స్  మొదలు పెట్టారు. ప్రస్తుతం సింగిల్‌గా ఉన్న ఈ హీరోతో మింగిల్ అవ్వడానికే హీరోయిన్స్ ఇలా చేస్తున్నారా అని కూడా సందేహాలు మొదలైయాయి అభిమానులకు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఈ వీడియో ఒక్కరోజులోనే విపరీతంగా వైరల్ అవుతూ  ట్రెండింగ్ లో ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: